పేరుకే స్టార్ హీరో కూతురు, 19 ఏళ్ల వయసులోనే లేచిపోయి పెళ్లి, కట్ చేస్తే రెండుసార్లు విడాకులు
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకలు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు.
అయితే ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఓ స్టార్ హీరో కూతురు పెద్దలను కాదని 19 ఏళ్ల వయస్సులోనే ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనితో ఓ బిడ్డను కన్న తర్వాత ప్రేమించిన వ్యక్తి నుంచి విడాకులు తీసుకుని షాకిచ్చింది. తర్వాత పెద్దల కుదిర్చిన వివాహం చేసుకున్న కొన్నాళ్లకే రెండో భర్తకు కూడా విడాకులిచ్చింది. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది ఎవరో గురించో కాదు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.

చిరంజీవి కూతురు శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే. శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దలను ఎదురించి మరి అతన్ని వివాహం చేసుకుంది. శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో పెను సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఆ సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై శ్రీజ సంచలన ఆరోపణలు చేసింది. భరద్వాజ్‌తో శ్రీజ కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది. కూతురు పుట్టిన తరువాత భర్త భరద్వాజ్‌తో విభేదాలు రావడంతో..అతనికి విడాకులు ఇచ్చింది.
పెద్దలు కుదిర్చిన వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. శ్రీజ రెండో భర్త కల్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తరువాత కొద్దిరోజులకే రెండో భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆఫిషియల్‌గా ప్రకటించకపోయినప్పటికీ..శ్రీజ- కల్యాణ్ ఇద్దరు వీడిపోయారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించడంతో.. పాటు.. ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో..వీరిద్దరూ విడిపోయారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ మధ్య శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినప్పటికీ అది కేవలం ప్రచారం మాత్రమే అని తేలిపోయింది. ప్రస్తుతం ఇద్దరి పిల్లలతో శ్రీజ తన తండ్రి చిరంజీవితోనే ఉంటున్నారు.












Click it and Unblock the Notifications