అనూహ్యం: కారు దిగి గన్‌తో బెదిరించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నారు. ఓ సందర్భంగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడాలంటే చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత అని విభజించి మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నారు. షూటింగ్ సమయంలోను, తన వ్యక్తిగత జీవితంలోను ఎంతో క్రమశిక్షణతో మెలుగుతారు. సభ్యత, సంస్కారం ఉట్టిపడేలా ఆయన జీవనశైలి ఉంటుంది. మధ్యతరగతి నుంచి వచ్చి మహోన్నతస్థాయికి ఎదిగినప్పటికీ తాను మాత్రం ఎప్పటికీ అలా ఒదిగే ఉంటారు.
షూటింగ్ కోసం కేరళ వెళ్లినప్పుడు
సినీ పరిశ్రమలో ఆయనతో ఎంతోమంది హీరోయిన్లు కలిసి నటించారు. వారందరూ ఆయనకు కుటుంబ స్నేహితులయ్యారు. వారిలో సుహాసిని కూడా అంతే. వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఓ సందర్భంలో జరిగిన సంఘటనను సుహాసిని వివరించారు. ఓ సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లినప్పుడు ముందు కారులో చిరంజీవి వెళుతుండగా, వెనక కారులో సుహాసిని, డ్యాన్స్ మాస్టర్, హెయిర్ స్టైలిస్ట్ ఉన్నారు. ఈ సమయంలో ఓ సంఘటన జరిగింది. కొందరు మద్యం సేవించి ఆ మత్తులో సుహాసినివాళ్లు ఉనన కారును వెంబడించి కారుపై బీరు సీసాలు విసిరారు.

గన్ తో బెదిరించడంతో పారిపోయారు
ముందు కారులో వెళుతున్న చిరంజీవి ఇది చూసి వెంటనే కారు దిగిన గన్ తో వాళ్లను బెదిరించడంతో వారంతా పారిపోయారు. హీరోయిజం అంటే కెమెరా ముందే కాదని, నిజ జీవితంలో కూడా హీరోయిజం చూపించాలని, చిరంజీవి అలా చూపించారని, ఆయన రియల్ లైఫ్ లో కూడా హీరో అంటూ సుహాసిని కొనియాడారు. ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో సుహాసిని చిరంజీవిని అడిగితే తనకు గుర్తుంది అని చెప్పారు. వాళ్లు మిమ్మల్ని వెంబడించడం అనేది అనూహ్య పరిణామమన్నారు. సుహాసినిక చిరంజీవి సమాధానం చెప్పే వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరలవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన మొత్తం వీడియో షేర్ చేయండి అంటూ నెటిజన్లు కోరుతున్నారు. మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications