అల్లు అర్జున్‌ను కాపాడటానికి రంగంలోకి దిగిన సుకుమార్
ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు అయింది దర్శకుడు సుకుమార్ పరిస్థితి. సుకుమార్ ఏదో అనుకుంటే మరేదో అయింది. పుష్ప-2 సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించాలని చూసిన ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడమే దీనికి కారణం.మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు.
దీంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ బద్ద శత్రువుగా మారిపోయారు.మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా విడుదల దగ్గర పడుతోంది. పుష్ప -2పై మెగా అభిమానుల ప్రభావం కచ్చింతంగా పడుతుంది. ఇప్పటికే సినిమా గురించి మెగా అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప-2 సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు నిర్మాతలు. సినిమా కలెక్షన్లకు రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ముఖ్యం కావడంతో నిర్మాతల్లో ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది.

మెగా అభిమానులు సినిమాపై నెగిటివ్ టాక్ తీసుకువస్తే పరిస్థితి తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే ఇలాంటి క్రమంలోనే సుకుమార్ ఈ వేడి తగ్గే వరకు సినిమాని రిలీజ్ చేయకూడదని డిసైడ్ అయ్యారట. ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాను డిసెంబర్‌కి వాయిదా వేసినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో బన్నీ కెరియర్ కాపాడడానికి సుకుమార్ ఇలా చేస్తున్నాడని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications