మహేష్‌బాబు - పవన్‌కల్యాణ్ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
తెలుగు తెరపై అందాల నటుడిగా కొనసాగుతూ అమ్మాయిల హృదయాలను కొల్లగొడుతున్నారు సూపర్ స్టార మహేష్ బాబు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు విరామం ప్రకటించి రాజకీయాల్లోకి వెళ్లి ఏపీకి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. తన జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. మహేష్ బాబు చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇలా వీరిద్దరూ సమాజ సేవ చేయడంతోపాటు అందరి హీరోల అభిమానుల దగ్గర మంచిపేరు తెచ్చుకున్నారు. స్టార్ డమ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో వీరిద్దరితో ఓ సినిమా తీయాలని ఓ అగ్ర దర్శకుడు ప్రయత్నం చేశారు. కథ చెప్పగా ఇద్దరికీ నచ్చింది. అయితే చివరకు అది పట్టాలెక్కకుండానే కథ ముగిసిపోయింది.
తీవ్రస్థాయిలో విమర్శలు వస్తాయని భావించి..
ఆ దర్శకుడు ఎవరో కాదు.. మహేష్ బాబుకు, పవన్ కల్యాణ్ కు ఎంతో సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరితో సినిమా తీయాలని ఓ కథను సిద్ధం చేసుకొని ఇద్దరు హీరోలకు వినిపించారు. ఇద్దరికీ నచ్చింది. కథ పట్టాలెక్కడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా వాయిదా పడింది. కథ ప్రకారం ఇద్దరు హీరోల అభిమానులను సంతృప్తి పరుస్తూ సమాంతరంగా కథను నడిపించడం అనేది కత్తిమీద సాములా మారింది. ఏమాత్రం తేడా వచ్చినా తమ హీరోను తక్కువ చేశారంటూ తీవ్ర విమర్శు రావడంతోపాటు అది పెద్ద వివాదానికి దారితీస్తుందేమోనని త్రివిక్రమ్ కు అనిపించింది. దీంతో సినిమా తీయడంకన్నా పూర్తిగా ఆపేయడం మంచిదని భావించి మహేష్ బాబుకు, పవన కల్యాణ్ కు విషయం చెప్పారు. వారిద్దరు కూడా అంగీకరించడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు.

ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తే బాగుండేది
ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీసివుంటే అప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నీ బద్ధలయ్యేవని సినీ విశ్లేషకులు కూడ అభిప్రాయపడ్డారు. అయితే ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో త్రివిక్రమ్ అత్తారింటికి దారేది తీసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. అలాగే గతేడాది సంక్రాంతికి మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తీసి ఇండస్ట్రీ ఫ్లాప్ ఇచ్చారు. ఈ సినిమా తీయడంపై మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో కొన్ని నెలలపాటు అతను బయట ఏ కార్యక్రమానికి రాలేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అల్లు అర్జున్ తో హిస్టారికల్ సినిమా తీయాలని కసత్తులు చేస్తున్నారు. అది ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయనున్నారు.












Click it and Unblock the Notifications