అతడు 2 పై బిగ్ అప్డేట్.. ఎవరితో తీస్తున్నారో తెలుసా..?
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ- రిలీజ్ సినిమాల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన లేదా మంచి కంటెంట్ ఉన్నా సరిగ్గా ఆడియన్స్ ను రీచ్ కాని మూవీస్ ను తిరిగి రీ- రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక్క హీరో అని కాదు.. దాదాపు అందరు హీరోలు తమ ఓల్డ్ మూవీస్ ను నేటి యువతకు పరిచయం చేస్తున్నారు. దీంతో కొత్త సినిమాలు ఉన్నా లేకున్నా రీ- రిలీజ్ సినిమాలతో ఈ మధ్య థియేటర్లు నిండిపోతున్నాయి. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీస్ కు ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన సినిమాలు రీ- రిలీజ్ అంటే బాక్సాఫీస్ బద్దలే అన్నంతగా కలెక్షన్స్ వస్తాయి. గతంలో మురారి, ఖలేజా సినిమాలు రీ- రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేశాయి.
Print Testing Done ✅✅ #AthaduSuper4K with 7.1 Dolby Atmos!🔥✅
— Mahesh Babu News🦁 (@MaheshBabuNews) July 17, 2025
Grand Re Release On August 9th!#Athadu4K @urstrulyMahesh pic.twitter.com/mjbppQt1af
అయితే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరో మూవీ రిలీజ్ కానుంది. అదే అతడు. మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఆగస్టు 9న రీ- రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రీ రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. హై క్వాలిటీతో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 10 లక్షల వ్యూస్ కు దూసుకెళ్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ సారి రీ- రిలీజ్ రికార్డులు మొత్తం ఈ మూవీ చెరిపేసేలా ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
2005లో మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అతడు సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇందులో మహేశ్ బాబు సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించింది. ముఖ్యంగా చిత్రంలోని డైలాగ్స్, పాటలకు నేటికీ ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ రీ- రిలీజ్ నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

అటు బుల్లి తెరపైనా అతడు మూవీ సంచలనాలు చేసింది. ఈ మూవీ విడుదలై రెండు దశాబ్దాలు అవుతుండగా వందల సార్లు టెలివిజన్ లో ప్రసారమైంది. టెలికాస్ట్ అయిన ప్రతిసారీ అతడు మంచి టీఆర్పీ అందుకుంది. అలా బుల్లితెర ప్రేక్షకులకు ఆల్ టైం ఫేవరేట్ మూవీగా అతడు మారింది. ఇక తాజాగా మూవీ రీ- రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు 2 చేయాల్సి వస్తే.. ఎవరితో చేస్తారని అడగ్గా.. మహేశ్ బాబు, త్రివిక్రమ్ లతోనే చేస్తానన్నారు. వారు కాకుండా మరొకరిని ప్రేక్షకులు అంగీకరించరని తెలిపారు. వారిద్దరూ డేట్స్ ఇస్తే అతడు 2 చేయడానికి రెడీ అని మురళీ మోహన్ అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
-
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు?









Click it and Unblock the Notifications