సూర్యను 3 సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం వస్తే ఏ నటి అయినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కానీ, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా ఆఫర్‌ను ఏకంగా మూడు సార్లు రిజెక్ట్ చేసిందో మలయాళ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరూ? ఆఫర్లు ఎందుకు తిరస్కరించాల్సి వచ్చింది? అసలు విషయం ఏంటో చూద్దాం.
మూడూ రిజెక్ట్.. కారణం అదే
మలయాళంతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులను కూడా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించే నటి నజ్రియా నజిమ్. జెంటిల్ మన్ ఇమేజ్ ఉన్న సూర్య సరసన నటించాల్సిందిగా గడచిన 12 ఏళ్లలో ఆమెను కోలీవుడ్ నుంచి పలుమార్లు సంప్రదించారు మేకర్స్. అయితే వ్యక్తిగత కారణాలు, తనను ఆకట్టుకోని కథల కారణంగా నజ్రియా ఆ మూడు ప్రాజెక్ట్‌లను సున్నితంగా తిరస్కరించారు. స్టార్ హీరో సినిమా, అది కూడా కోలీవుడ్ క్రేజీ ఆఫర్ అని తొందరపడకుండా.. తనకు నచ్చిన పాత్రలకు, ప్రాధాన్యత ఉన్న కథలకే ఓటెయ్యాలనే నజ్రియా క్లారిటీని హీరో సూర్య స్వయంగా ఎన్నోసార్లు మెచ్చుకున్నారు.

నాలుగోసారి ఓకే
ఎట్టకేలకు నాలుగో ప్రయత్నం సఫలమైంది. ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో సూర్య హీరోగా, జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సీన్' చిత్రంలో నటించడానికి నజ్రియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తాను మళ్లీ తమిళ తెరపైకి రీఎంట్రీ ఇస్తుండటానికి ప్రధాన కారణం సూర్య అని నజ్రియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈసారి కథ నూటికి నూరుపాళ్లు నచ్చడంతో పాటు సూర్యతో కలిసి పనిచేసే అవకాశం రావడంతో వెంటనే అంగీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్‌పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి.














Click it and Unblock the Notifications
