రూ.350 కోట్ల బడ్జెట్ సినిమా లీక్
తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తోన్న చిత్రం 'కంగువా'. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. 'కంగువా' తొలి తమిళ పాన్ ఇండియా సినిమాగా రూపొందించడం జరిగింది. ఈ సినిమాతో సూర్య రూ.1000 కోట్ల మార్కెట్‌లో చేరతారనే ప్రచారం జరుగింది. దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. భారీ అంచానల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. కర్ణుడు చావుకు వంద కారణాలు ఉన్నట్టు ఈ సినిమా ఫ్లాప్‌కు చాలానే కారణాలు ఉన్నాయి.
తొలుత ఎంచుకున్న కథ బాలేదని మాటలు వినిపించాయి. ఆ తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బాలేదని కామెంట్స్ చేశారు. సినిమా లెంగ్త్ ఎక్కువ అయిందని మాటలు కూడా తెర మీదకు వచ్చాయి. మొత్తానికి సూర్య యాక్టింగ్ బాగున్నప్పటికీ , సినిమా బాలేదని తేల్చేశారు. కంగువా సినిమా రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. ఓవరాల్‌గా ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్లని కంగువా వసూలు చేసినట్లు తెలుస్తోంది. సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.

ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. కాగా.. డిసెంబర్ 13 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా సడన్‌గా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమై షాకిచ్చింది. ఒరిజినల్ ప్రింట్ పలు వైబ్‌సైట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. మరి దీనిపై కంగువా టీం , అమెజాన్ ప్రైమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications