సూర్య 'రెట్రో' మూవీ రివ్యూ.. అదొక్కటే పెద్ద మైనస్
హీరోలకు హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి సర్వ సాధారణం. ఫ్లాప్ వచ్చినప్పుడు డీలా పడడం, హిట్ వచ్చినప్పుడు పొంగిపోవడం అనేది హీరోల జీవితాల్లో కామన్‌గా జరిగేదే. అయితే ఓ హీరో 13 ఏళ్లుగా వరుసగా ఫ్లాప్స్‌ను చవి చూస్తూనే ఉన్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. తమిళ స్టార్ హీరో సూర్య. గత కొంతకాలం సరైన హిట్ లేక సతమతం అవుతున్నారు. తాజాగా సూర్య నటించిన చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డె హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ
మొదటి నుంచి గ్యాంగ్ స్టార్‌గా ఉన్న వ్యక్తి పలు కారణాలతో ఆ పనిని వదిలివేయాలని భావిస్తుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా మళ్లీ గ్యాంగ్ స్టార్‌గా మారాల్సి వస్తుంది. అయితే ఆ సమయంలో అతనకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడనే సినిమా కథ.

విశ్లేషణ
కథ సింపుల్‌గానే ఉన్నప్పటికీ,కథనం మాత్రం డిఫరెంట్‌గా ఉంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్క్రీన్ ప్లేతో అదరగొట్టాడు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ని వాడుతూ పార్లల్ గా యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించిన విధానం బాగుంది. ఒకేసారి రెండు సూర్య క్యారెక్టర్‌లకు సంబంధించిన సీన్లను చూపించాడు దర్శకుడు.దర్శకుడు ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా రొటీన్ సినిమాల కంటే భిన్నంగా ఉంది.యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు.అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా అయితే కనిపించవు.

ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సూర్య మరోసారి తన నటనతో అదరగొట్టాడు. సినిమాను తన భూజాలపై మోశాడు సూర్య. తన క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించాడు.సూర్య ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లన్నింటిలో ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్ గా నిలిచిపోతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. పూజా హెగ్డే పర్ఫామెన్స్ ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. ఈ సినిమాలో ఆమె పాత్రకి పర్ఫామెన్స్ చేసే స్కోప్ దక్కింది. ప్రకాష్ రాజ్,జోజ్ జార్జ్ ,నాజర్ వంటి సీనియర్ నటులు ఆకట్టుకున్నారు.ఇక మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ అంశాలు
సినిమా టెక్నికల్ అంశాలు గురించి మాట్లాడుకోవాలంటే మొదటగా, సినిమా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలి. తనదైన స్క్రీన్ ప్లేతో దర్శకుడు మాయ చేశాడు. సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ సూపర్బ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది.నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ
సూర్య యాక్టింగ్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది
కొన్ని అనవసరపు సీన్స్












Click it and Unblock the Notifications