పవన్ కళ్యాణ్ "ఓజీ" నుంచి "సువ్వీ సువ్వీ" సాంగ్ రిలీజ్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ "ఓజీ (OG)". యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలానే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ పార్ట్‌కి సంబంధించి షూటింగ్ పూర్తి కాగా.. మిగతా ఆర్టిస్టుల షూటింగ్ పార్ట్‌తో పాటు కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. దీనితో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని చూడా జరుపుకుంటున్నారు.

ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇక ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఒక బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.
సువ్వి సువ్వి అంటూ సాగుతూ.. ఈ సాంగ్ ఆటకట్టుకునేలా ఉంది. కల్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్, శ్రుతి రంజనీ ఆలాపన, తమన్ అందించిన ట్యూన్.. ఈ సాంగ్‌ని మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేశాయి. పవన్ కళ్యాణ్-ప్రియాంక మోహన్ కెమిస్ట్రీ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమన్ నుంచి ఇలాంటి క్లాసీ ట్యూన్ వస్తుందని ఊహించలేదు" అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Happy Vinayaka Chavithi to all ❤️❤️
— DVV Entertainment (@DVVMovies) August 27, 2025
We will continue this celebration for a long time to come….#SuvviSuvvi is out now. https://t.co/DmNhvn1lqy#OG #TheyCallHimOG pic.twitter.com/oBIulLuSFC
ఇక ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఘనంగా నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. సెప్టెంబర్ 18 లేదా 19వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం "ఉస్తాద్ భగత్ సింగ్". హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
-
విడుదల వేళ.. ఉస్తాద్ షాకింగ్ డెసిషన్ -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో.. -
చిరంజీవి కూతురుగా బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్.. ఎవరంటే..? -
టాలీవుడ్ హీరోకు షాక్ .. 'పెళ్లయిన 3 రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది'..! -
Tollywood: డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన నిర్మాత -
ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్.. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా..!! -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
కుర్ర హీరోలకి ఇచ్చిన వాల్యూ "అల్లు అర్జున్" మంచు హీరోలకి ఇవ్వలేదుగా..? -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !!












Click it and Unblock the Notifications