నీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది అన్నా..!
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి దృశ్యకావ్యం " కాంతార చాప్టర్-1" దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భారీ హైప్ తో వచ్చిన ఈ మూవీ అంచనాలకు మించి ఉండటంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 10 రోజుల్లో రూ. 590 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. గత రెండు రోజుల్లో కాంతార ఛాప్టర్-1 మూవీ రూ. 79 కోట్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. హిందీలో ఇప్పటివరకు రూ. 132 కోట్ల నెట్ వచ్చిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో దీపావళి సెలవులు ఉన్నాయి. దీంతో ఈ మూవీ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Climax shooting ನ ಸಮಯ … ಊದಿಕೊಂಡಿದ್ದ ಕಾಲು , ನಿತ್ರಾಣವಾಗಿದ್ದ ದೇಹ.. ಇವತ್ತು ಕೋಟ್ಯಂತರ ಜನ ನೋಡಿ ಮೆಚ್ಚುವಹಾಗೆ ಆಗಿದೆ.. ಇದು ನಾವು ನಂಬಿರುವ ಶಕ್ತಿಗಳ ಆಶೀರ್ವಾದದಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ ..
— Rishab Shetty (@shetty_rishab) October 13, 2025
ಸಿನಿಮಾ ನೋಡಿ ಅಭಿಪ್ರಾಯ ವ್ಯಕ್ತ್ಯಪಡಿಸಿದ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು..
This was during the climax shoot , a swollen leg, an… pic.twitter.com/JJadywiaXN
కాంతార చాప్టర్-1 మూవీకి కర్త, కర్మ, క్రియ రిషబ్ శెట్టినే.. ఈ మూవీలో ఓ వైపు ప్రధాన పాత్ర పోషిస్తూనే మరోవైపు దర్శకత్వం నిర్వహించారు. అయితే ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి ఎంత కష్టపడ్డాడో మనకు తెలిసిందే. అయితే మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తన కాళ్లు వాచిపోయాయని.. శరీరం అలసిపోయి సహకరించలేదని అయినా చిత్రాన్ని అనుకున్న టైమ్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ కష్టం వల్లే క్లైమాక్స్ అభిమానులు ఆరాధించే స్థాయికి వెళ్లిందన్నారు. తాను నమ్మిన దైవశక్తి ఆశీర్వాదంతో ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ మేరకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇక కాంతార చాఫ్టర్-1 చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కన్నడ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల పరంగా ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈ సినిమా 2022లో సంచలన విజయం సాధించిన 'కాంతార' కు ప్రీక్వెల్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా కనిపించారు. హోంబలే ఫిల్మ్ ఈ సినిమాను నిర్మించింది. ఇక ప్రస్తుతం రిషబ్ శెట్టి జై హనుమాన్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications