50 ఏళ్ల వయసులో 29 ఏళ్ల హీరోతో టబు రొమాన్స్.. ఓటీటీని షేక్ చేస్తున్న వెబ్ సిరీస్..!

టాలీవుడ్ లో అనేక హిట్ సినిమాల్లో నటించారు సీనియర్ నటి టబు. హైదరాబాద్ లో పుట్టి పెరిగి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించారు. వెంకటేశ్‌ సరసన 'కూలీ నం.1' మూవీతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు టబు. హిందీ, తెలుగు అని తేడా లేకుండా అనేక సినిమాలు చేశారు. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ సరసన నటించారు. 2008లో బాలకృష్ణ 'పాండు రంగడు' తర్వాత టాలీవుడ్‌ కు దూరమైన ఆమె 2020 లో అల్లుఅర్జున్ 'అల వైకుంఠపురములో' మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే టబు వేశ్య పాత్రలో చేసిన ఓ వెబ్ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తున్న విషయం మీకు తెలుసా..?

ఓ 29 ఏళ్ల కుర్రాడు.. 53 ఏళ్ల మహిళతో రిలేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఏ సూటబుల్ బాయ్'. 2020 సంవత్సరం లో ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. రిలీజ్ నుంచి నెట్ ఫ్లిక్స్ లో సంచలనం సృష్టించింది. ఇందులో ఇషాన్ ఖత్తర్, సీనియర్ హీరోయిన్ టబు నటించారు.

అయితే ఈ వెబ్ సిరీస్ పై యంగ్ హీరో ఇషాన్ ఖత్తర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు. 'ఈ స్టోరీ చెప్పగానే మొదట్లో కాస్త భయపడ్డాను. ఎందుకంటే ఇందులో ప్రముఖ హీరోయిన్ టబు ఉంటుంది. ఆమెతో రొమాన్స్ అంటే మన స్థాయి సరిపోదు ఏమో అనుకున్నాను. కానీ సెట్స్ లోకి వెళ్లిన తర్వాత ఆమె నన్ను చాలా కంఫర్ట్ చేశారు. నాతో చిన్న అమ్మాయి లాగా మాట్లాడేవారు. కెమెరా ఆన్ అవ్వగానే మాత్రం తన నట విశ్వరూపం చూపించేవారు.. అంటూ చెప్పుకొచ్చారు యంగ్ హీరో ఇషాన్ ఖత్తర్.

Tabu indian actres Romances 29YrOld Hero in A Suitable Boy OTT Shaken by Bold Age-Gap Love

ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే.. ఓ పాపులర్ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇందులో ఒక తల్లి తన కూతురుకి మంచి సంబంధం చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో వాళ్లకు హీరో పరిచయం అవుతాడు. హీరోతో సంబంధం కుదిరించుకున్న తర్వాత వాళ్లకు ఒక విస్తుపోయే నిజం తెలుస్తుంది. హీరోకు 53 ఏళ్ల వేశ్యతో సంబంధం ఉంది అని. అది తెలిసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే స్టోరీ.. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+