ఎయిర్‌పోర్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ తమన్నా ముంబై ఎయిర్‌పోర్టులో అడ్డంగా దొరికిపోయింది. ప్రియుడుతో కలిసి విదేశాలకు జంప్ అయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తమన్నా తన 18 ఏళ్ల కెరీర్‌లో ఎలాంటి రూమార్లకు తమన్నా చోటివ్వలేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించిన తమన్నా స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా తెలుగులో అగ్ర హీరోలతో నటించి స్టార్ స్టేటస్ తెచ్చుకుంది.

అయితే కొన్నాళ్లుగా తమన్నా హవా తగ్గిందనే చెప్పాలి. యంగ్ హీరోయిన్లు సత్తా చాటడంతో హీరోయిన్‌గా తమన్నాకు అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ కూడా కొన్ని వెబ్ సీరిస్‌లో నటిస్తోంది. తన కెరీర్ అసాంతం రూమర్లకు, ఎఫైర్లకు దూరంగా ఉన్న తమన్నా.. ఇటీవలే ఓ బాలీవుడ్ నటుడుతో ప్రేమలో పడింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో మునిగి తేలుతుంది.

మొదట్లో విజయ్ వర్మతో ఎఫైర్‌పై వస్తోన్న వార్తలను ఖండించిన తమన్నా.. తరువాత అతన్ని గాడంగా ప్రేమిస్తున్నానని ప్రకటించింది. తమ ప్రేమను బహిర్గతం చేసిన దగ్గర నుంచి ఇద్దరూ కూడా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇద్దరూ విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు చాలు విహారానికి చెక్కెస్తున్నారు. తాజాగా ఇద్దరూ ఒకరి తరువాత మరొకరు ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమన్నా, విజయ్ వర్మ కలిసి మొదట గోవాకు ,ఆ తరువాత లండన్‌కు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారని సమాచారం. మరో నాలుగు రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ప్రత్యేకంగా రొమాంటిక్ టూర్ ప్లాన్ చేశారు.న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ముగిసిన తరువాతే తిరిగి దేశానికి ఈ జంట రానున్నారు. అయితే పెళ్లికి ముందే ఇలా ప్రియుడుతో కలిసి డేటింగ్‌కు వెళ్లడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications