ప్రియుడుతో పెళ్లిపై మాట మార్చిన తమన్నా..ఆ ఉద్దేశమే లేదు

హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది.

తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

Tamannaah Bhatia open about marriage with Vijay Varma

వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి.రిలేషన్ గురించి వీరిని ప్రశ్నించగా..అలాంటిది ఏమీ లేదని..తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కలరింగ్ ఇచ్చారు. విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తమన్నా తళుక్కున మెరిసింది. దీంతో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందని అందరికి అర్థం అయింది. ఇదే సమయంలో తమ బంధంపై ఈ జంట గతేడాది చివర్లో ఓ క్లారిటీ ఇచ్చారు.

తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని..త్వరలోనే పెళ్లికి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది. తాజాగా తమన్నాతో డేటింగ్‌పై విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న తమన్నా పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో ఒక్క మాట చెబుతారా అని మీడియా వేసిన ప్రశ్నకు ఇప్పట్లో తాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. తమన్నా లవర్ విజయ్ వర్మతో పెళ్లి పీటలు ఎక్కుతుందని అందరూ భావిస్తున్న సమయంలో ఇప్పట్లో ఆ ఆలోచనే లేదని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+