ఆ హీరోయిన్‌ది ఏముంది..సినిమా నావల్లే హిట్ అయింది - తమన్నా

హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్‌తో ఈ పాల బుగ్గల సుందరి అదరగొడుతోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.

ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే.

Tamannaah Bhatia shocking comments on Stree 2 movie

తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది.

తమన్నా ఇటీవల కొన్ని ఐటం సాంగ్స్‌ చేసింది. జైలర్, స్త్రీ2 వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో తన డ్యాన్స్, ఫిజిక్‌తో కుర్రకారుకు చెమటలు పట్టించింది. ముఖ్యంగా స్త్రీ2 సినిమాలో ఐటం సాంగ్‌పై తమన్నా స్పందిస్తూ .. స్త్రీ 2 సక్సెస్‌కి కారణం 'ఆజ్ కీ రాత్' అనే పాటే. ఈ సాంగ్‌లో నేను నా ప్రాణం పెట్టి నటించాను అందుకే ఈ సినిమా ఇంతలా హిట్ అయిందని మిల్క్ బ్యూటీ చెప్పుకొచ్చింది.దీంతో ఆమెపై శ్రద్ధా కపూర్ కపూర్ అభిమానులు మండిపడుతున్నారు. ఒక్క సాంగ్ వల్లే సినిమా హిట్ అయితే హీరో, హీరోయిన్లు ఎందుకుని, అలా అయితే ఐటం సాంగ్ చేసిన చాలా సినిమాలు హిట్ అయ్యేవి అంటూ తమన్నా చేసిన వ్యాఖ్యలకు శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+