పెళ్లికి ముందే అతనితో.. ఓపెన్ అయిన తమన్నా
తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి , తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు.

త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. తాజాగా తమన్నా ప్రియుడుపై ఓపెన్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్క్ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ..' విజయ్ రాకతో నా లైఫ్ అంతా మారిపోయింది. తను పక్కనుంటే యావత్ ప్రపంచాన్నే గెలవగలను అనిపిస్తుంది. తన నిజాయితీ అంటే నాకిష్టం' అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
ఇక పెళ్లికి ముందే ఇల్లు కొనుగొలు చేసే ప్రయత్నం చేస్తోంది. తారలంతా ఉండే బాంద్రా ఏరియాలోనే తమన్న-విజయ్ వర్మ కూడా ఉండాలని ఫిక్స్ అయ్యారు. దీని కోసం వాళ్లు కొన్ని ఖరీదైన అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్స్ చూస్తున్నారు. పెళ్లి తర్వాత కొత్త ఫ్లాట్ లోకి మారాలనేది వాళ్ల ఆలోచన. అంతకంటే ముందు తమ అభిరుచులకు తగ్గట్టు ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటారు. వచ్చే ఏడాది వీరు పెళ్లి పీటలు ఎక్కే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications