ప్రియుడుకు హ్యాండ్ ఇచ్చి.. ఆ నిర్మాతతో క్లోజ్‌గా తమన్నా
హీరోయిన్ తమన్నా మొన్నటి వరకు గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది.వీరు కలిసి 'లస్ట్ స్టోరీస్ 2'సినిమాలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.2022 నుంచి వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. మీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి. రిలేషన్‌పై వీరిని ప్రశ్నించగా. అలాంటిది ఏమీ లేదని..మేమిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కలరింగ్ ఇచ్చారు.
విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తమన్నా తళుక్కున మెరిసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లారు. దీంతో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందని అందరికి అర్థం అయింది. ఇదే సమయంలో తమ బంధంపై ఈ జంట గతేడాది చివర్లో ఓ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని..త్వరలోనే పెళ్లికి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది.పలు ఈవెంట్స్‌లో తమన్నాతో కలిసి విజయ్ వర్మ సందడి చేశారు.

పలు ఫంక్షన్స్‌లో తమన్నా హ్యాండ్ బ్యాగులు కూడా మోస్తూ విజయ్ వర్మ కనిపించారు. ఇక పెళ్లే అనుకున్న తరుణంలో ప్రియుడు వర్మకు షాకిచ్చింది తమన్నా. ప్రియుడు వర్మకు సంబంధించిన ఫొటోలు,వీడియోలను మిల్కీ బ్యూటీ డిలీట్ చేసింది.తమన్నా, విజయ్ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతోనే వీరు విడిపోయినట్టు తెలుస్తోంది. దీంతో తమన్నా, విజయ్ వర్మల బంధం మధ్యలోనే ముగిసిపోయింది. అయితే బ్రేకప్‌పై వీరిద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు. బ్రేకప్ తర్వాత తమన్నా తన సినిమాలతో బిజీగా మారింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో 'ఓదెల-2' సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మూవీలో ఆమె నాగసాధువుగా కనిపించనుంది.
ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్స్‌లోకి రానుంది. ఇదిలా ఉంటే తాజాగా తమన్నా ఓ నిర్మాతతో క్లోజ్‌గా దిగిన ఫొటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌తో క్లోజ్‌గా ఉండగా.. అతను నడుముపై చేతి వేసి మరీ ఫొటోకు పోజులిచ్చాడు. ఇందులో బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి తమన్నా మత్తెక్కించే అందంతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications