ఈ అందాలను చూడడానికి రెండు కళ్లు సరిపోవుగా..!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ అందాల భామ, కెరీర్ ఆరంభం నుంచే స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ సహా పలు భాషల్లో సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. లవ్ స్టోరీస్, యాక్షన్ ఎంటర్టైనర్స్, కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు... జానర్ ఏదైనా సరే తమన్నా తన నటనతో ప్రత్యేక ముద్ర వేసింది.

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తెలుగులో సినిమాలు కాస్త తగ్గించినప్పటికీ బాలీవుడ్, కోలీవుడ్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో ఫుల్ ఫామ్‌లో కొనసాగుతోంది. గతేడాది 'ఓదెల 2' తో విజయాన్ని అందుకున్న తమన్నా.. కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. కోలీవుడ్‌లో విశాల్ నటిస్తున్న "పురుషన్" (తెలుగులో 'మొగుడు'గా డబ్బింగ్) సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, సంజయ్ దత్ కలిసి నటిస్తున్న 'రేంజర్' మూవీలోనూ ముఖ్యమైన రోల్ చేస్తోంది. ఓటీటీ సిరీస్‌లలో కూడా బోల్డ్, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో కొత్త ఇమేజ్‌ను క్రియేట్ చేస్తోంది.

tamannah-bhaia-latest-new-stre-launched-at-mumbai-and-celebrities-spotted-at-event

ఇదిలా ఉండగా.. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కొత్త స్టోర్ ప్రారంభోత్సవం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. రెడ్ కార్పెట్‌పై స్టార్‌ల సందడి, గ్లామర్ లుక్స్‌తో ఈ ఈవెంట్ పూర్తిగా సెలబ్రిటీ ఫీవర్‌ను క్రియేట్ చేసింది. ఈ వేడుకలో మృణాల్ ఠాకూర్ ఎలిగెంట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించగా, సిద్ధార్థ్ మల్హోత్రా స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో అభిమానులను అలరించారు.

అంతే కాకుండా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొని తన క్లాసీ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇక ఈ ఈవెంట్‌లో మరో హైలైట్‌గా నిలిచింది 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే. రెడ్ కార్పెట్‌పై తన గ్రేస్, చార్మ్‌తో మెరిసిన పూజా... బ్లూ స్ట్రాప్‌లెస్ టాప్, హై వెయిస్ట్ డెనిమ్ జీన్స్‌లో ట్రెండీ లుక్‌తో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. సింపుల్ అయినా స్టైలిష్ యాక్సెసరీస్ ఈ లుక్‌కు మరింత ప్లస్ అయ్యాయి. మెడలో చోకర్ నెక్లెస్, చేతికి బ్రేస్‌లెట్స్, స్టైలిష్ హ్యాండ్‌బ్యాగ్ మొత్తం డ్రెస్సింగ్‌ను కంప్లీట్ చేశాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

ఫ్యాషన్, గ్లామర్, నటన... అన్నింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేయగల అరుదైన నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. ట్రెడిషనల్ లుక్‌లోనూ, మోడ్రన్ అవతార్‌లోనూ ఆమె కనిపించే తీరు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. పూజా అంటే కేవలం అందమే కాదు... స్టైల్, గ్రేస్, టాలెంట్ అన్నింటి సమ్మేళనం అనే చెప్పాలి. 'ఆచార్య' తర్వాత కొంతకాలం టాలీవుడ్‌కు దూరమైన పూజా హెగ్డే, చాలా విరామం తర్వాత దుల్కర్ సల్మాన్ సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

tamannah-bhatia-latest-new-stre-launched-at-mumbai-and-celebrities-spotted-at-event

అంతేకాదు తెలుగులో పూజాకు మరో క్రేజీ ఛాన్స్ దక్కినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. విక్టరీ వెంకటేష్‌కు జంటగా పూజా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 'మన శంకరవరప్రసాద్ గారు'తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, తన నెక్స్ట్ మూవీని వెంకటేష్‌తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అలాగే తమిళ చిత్రంతో మరోసారి కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి కూడా పూజా సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఒకవైపు మిల్కీ బ్యూటీ తమన్నా పాన్ ఇండియా లెవల్‌లో దూసుకుపోతుంటే... మరోవైపు బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్రాండ్ రీఎంట్రీతో మళ్లీ సౌత్ ఇండస్ట్రీలో తన మార్క్ వేయడానికి రెడీ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+