హిట్ కావాలంటే మరో హీరో ఉండాల్సిందేనా.. మెగాస్టార్ 158లో తమిళ్ స్టార్ హీరో !

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర'.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 'మన శంకరవరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు' చిత్రాలు చేస్తున్నారు. అలానే తన నెక్స్ట్ సినిమాను కూడా రీసెంట్ గానే తన పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ బాబీతో మూవీ అనౌన్స్ చేశారు. 'మెగా 158' వర్కింగ్ టైటిల్ తో ఆ మూవీ రాబోతుంది. గతంలో 'వాల్తేరు వీరయ్య'తో హిట్ కొట్టిన బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్‌డ్రాప్ తో చూపించారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ ని బాబీ రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్ అనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి అనుష్క శెట్టి. బాహుబలి సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది.

tamil-actor-karhi-going-to-act-in-mega-star-158-movie-with-bobby

చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హిట్ కొట్టగా.. నాలుగేళ్ల తర్వాత ఘాటితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ చిరుతో కలిసి మెగా 158లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు సమాచారం. అలానే మాళవిక మోహనన్ ను కూడా హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్.

ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని డిఓపిగా పనిచేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారకంగా వెల్లడించాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి సినిమాలో మరొక కోలీవుడ్ నటుడు కార్తీ కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో కార్తీ ఫుల్ లెన్త్ పాత్రలో కనిపించనున్నారని.. చిత్రం గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అంటున్నారు. ఇక ఈ సినిమాని 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక కార్తీకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమాలో కార్తీ నటిస్తే ఇక మామూలుగా ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

tamil-actor-karhi-going-to-act-in-mega-star-158-movie-with-bobby

అయితే చిరు ఇటీవల నటించిన సినిమాలు గమనిస్తే వాల్తేరు వీరయ్యలో రవితేజ ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు తెరకెక్కుతున్న అనిల్ రావిపూడి మూవీలో వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్లీ మరో హీరో ఉండడంతో చిరు హిట్ కొట్టాలంటే మరో హీరో ఉండాల్సిందేనా అంటూ కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+