త్రిష రేప్ సీన్ వ్యాఖ్యలపై స్పందించిన తమిళ నటుడు మన్సూర్..
తమిళంలో ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తూ అందరిని మెప్పింస్తుంటాడు నటుడు మన్సూర్ అలీఖాన్. ఈ నటుడు తాజాగా నటి త్రిషపై రేప్ సీన్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మన్సూర్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను.
ఆ సీన్స్‌లో నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని. హ్యాపీగా ఫీల్ అయ్యాను. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో కూడా నాకు రేప్ సీన్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ, ఆ సినిమాలో అలాంటి సీన్ లేదు అని బాధపడ్డాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలు కాస్త నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.

ఈ వ్యాఖ్యలు తమిళ ఇండస్ట్రీని కుదిపేసాయి. నటి త్రిష కూడా ఈ విషయంపై స్పందించారు. దీనిని త్రీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలని ద్వేషిస్తున్నట్టు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళతో కలిసి నాకు సినిమాలో సీన్స్ లేనందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నా తర్వాత సినిమాల్లో కూడా ఇతనితో కలిసి నటించకుండా ఉండేలా చూసుకుంటాను అంటూ త్రిష తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌చేశారు.
అయితే, నటి త్రిషకి మద్దతుగా చాలామంది సెలబ్రటీలు నిలిచారు. అందులో లియో దర్శకుడు లోకేష్ కానగరాజ్ కూడా ఉన్నారు. ఇంకా నటుడు కార్తీక్ సుబ్బరాజు, సింగర్స్ మాళవిక, చిన్మయి, నటుడు నితిన్.. ఇలా చాలామంది సెలబ్రిటీలు త్రిషకి అండగా నిలిచారు.

స్పందిచిన మున్సూర్ ఆలీఖాన్..
అయితే, త్రిషపై చేసిన వ్యాఖ్యలపై తాజాగా మన్సూర్ అలీఖాన్ స్పందించారు. ఈ వీడియో వైరల్ అయిందని నేను నా ఫ్యామిలీ ద్వారానే తెలుసుకున్నాను. నేను పూర్తిగా మాట్లాడింది చూడకుండా అక్కడి వరకు మాత్రమే కట్ చేసి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్త వైరల్‌గా మారింది. నాకు కూడా కూతుళ్లు ఉన్నారు. నా కూతురు లియో సినిమా ఓపెనింగ్ కి కూడా రావడం జరిగింది. నా కూతురు నటి త్రిషకి పెద్ద ఫ్యాన్.
తను త్రిషతో కూడా మాట్లాడింది. నాపై కావాలనే కొంతమంది ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నేను ఇటీవల రాజకీయాల్లో చేరాను. రాబోవు ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్నాను. అందుకే నన్ను ఈ విధంగా నెగటెవ్‌గా చూపిస్తున్నారు. ఈ విషయం నాకు ఒక పరువు నష్టం లాంటిది అంటూ సోషల్‌మీడియాలో తన ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో మన్సూర్ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications