ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం

తమిళ విలక్షణ నటుడు, దర్శకుడు పార్థిబన్ వ్యవహారం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన " ఉస్తాద్ భగత్ సింగ్ " సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మూవీ విడుదలకి ముందు హైదరాబాద్‌లో జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దాంతో ఆ వివాదానికి ముగింపు పలకడమే కాకుండా సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'నో కాస్ట్ - నో రిలీజియన్ సర్టిఫికెట్' కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకున్నట్టు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఏం జరిగిందంటే..

ఆ ఈవెంట్‌లో తనను తాను పరిచయం చేసుకుంటూ పార్తిబన్ అనుకోకుండా తన సామాజిక వర్గాన్ని ప్రస్తావించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గుర్తింపు పొందిన వ్యక్తి ఇలా కులాన్ని ప్రస్తావించడం సరైంది కాదని నెటిజన్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో స్పందించిన పార్తిబన్.. ఒక వీడియో సందేశం ద్వారా తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. "నేను కులమతాలను అస్సలు పట్టించుకోను. నా మాతృభాష తెలుగు అని చెప్పబోయి పొరపాటున ఆ పదం వాడాను. అది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు" అని స్పష్టం చేశారు.

tamil-actor-and-director-parthiban-shocking-decision-over-no-caste-and-no-religion-certificate-and-v

అంతే కాకుండా తనపై వచ్చిన విమర్శలు తనను ఆలోచింపజేశాయని.. అందుకే సమాజానికి ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కులం, మతం లేకుండా ఉండే సర్టిఫికెట్ పొందే అవకాశం ఉందని తెలిసిన వెంటనే దానికి దరఖాస్తు చేశానని వెల్లడించారు. "ఈ సర్టిఫికెట్ పొందిన తొలి సినీ నటుడిని నేనే అవుతాను. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి, కులమతాలకు అతీతమైన సమాజం కోసం ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తాను" అని ఆయన పేర్కొన్నారు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించారు. Mythri Movie Makers
బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమా ప్రారంభంలో పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులకు మాస్ ఫీస్ట్‌లా అనిపించినా, మొత్తం కథనంలో కొత్తదనం లేకపోవడం మైనస్‌గా మారింది. రొటీన్ స్టోరీ, ప్రిడిక్టబుల్ ట్విస్టులు, పాత తరహా డైలాగులు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. దీంతో పబ్లిక్ టాక్ మిక్స్‌గా మారింది.

ఇదే సమయంలో బాలీవుడ్ చిత్రం ధురందర్ 2 పోటీగా విడుదల కావడం 'ఉస్తాద్ భగత్ సింగ్'కు పెద్ద సవాల్‌గా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందీ సినిమాకు మెరుగైన వసూళ్లు రావడం ఆశ్చర్యం కలిగించింది. సోషల్ మీడియాలో కూడా 'ఉస్తాద్'పై ట్రోల్స్ పెరిగి, కంటెంట్ పరంగా సినిమా బలహీనంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+