కోమాలోకి కోలీవుడ్.. ఏడాదిలో 223 సినిమాలు ప్లాఫ్..!

తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది.ఒకప్పుడు శంకర్, మురుగదాస్, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుల సినిమాలతో ఓ వెలుగు వెలిగిన తమిళ సినిమా ప్రస్తుతం..ప్రస్తుతం ఓ సూపర్ హిట్ సినిమా తీయడానికే నానా తంటాలు పడుతోంది. తమిళ ఇండస్ట్రీకి రూ.1000కోట్ల సినిమా ఇంకా కలగానే ఉంది. ఈ ఏడాది దాదాపు 220కి పైగా సినిమాలు ప్లాఫ్ అయినట్లు సమాచారం. ఈ సినిమాల కోసం తమిళ నిర్మాతలు రూ. 3000 ఖర్చు చేయగా.. రూ. 1000కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి.2024లో అమరన్, మహారాజ,గరుడన్ చిత్రాలు తప్పిస్తే మిగతా సినిమాలు ప్లాఫ్ బాట పట్టడం గమనార్హం.

241లో 18 చిత్రాలు మాత్రమే హిట్..

గతేడాది కోలీవుడ్ లో మొత్తం 241 సినిమాలు రిలీజ్ కాగా కేవలం 18 చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మిగతా సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. మరికొన్ని సినిమాలైతే రిలీజైన విషయం కూడా తెలియకపోవడం విశేషం. సూర్య, కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాలు సైతం అపజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో అటు ప్రేక్షకులు, ఇటు సినిమా వర్గం 2025పైనే అన్ని ఆశలు పెట్టుకుంది.

Tamil Cinema Struggles A Year of Box Office Disappointments in 2024

బోల్తా కొట్టిన కంగువా..

సూర్య, శివ కాంబోలో వచ్చిన మూవీ కంగువా. ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ బాంబ్ గా నిలిచింది. రూ. 350 కోట్లు పెట్టి భారీ హంగులతో నిర్మించారు. రూ. 1000కోట్ల బొమ్మ అంటూ ప్రచారం చేశారు. కానీ ఈ మూవీ అనూహ్యంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఇండియన్ 2 పరాజయం

కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ మూవీ కేవలం రూ. 150 కోట్లు మాత్రమే వసూళ్లు చేసి ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాక రజనీకాంత్ వెట్టయాన్ మూవీ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దళపతి విజయ్ నటించిన GOAT మూవీ మాత్రమే మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తమిళ సినిమాల సక్సెస్ రేటు కేవలం 7శాతానికే పరిమితమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+