ఎంత త్యాగం చేశావ్ బ్రో.. సినిమా షూటింగ్ కోసం "హనీమూన్" వాయిదా !
యంగ్ హీరో కిషన్ దాస్.. తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు ఈ నటుడు. నటనలో సహజత్వం, పాత్రలో ఒదిగిపోయే తత్వం అతన్ని ప్రేక్షకులకి మరింత దగ్గర చేసింది. తనదైన శైలిలో నటిస్తూ విభిన్న పాత్రలతో ఆడియన్స్ ని అలరిస్తూ.. కొత్త తరం నటుల్లో తనకంటూ సపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.
సినీ కెరీర్..
కిషన్ తన తొలి చిత్రం 'ముదలుం నీ ముడివుం నీ' తో మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ మూవీలో మీతా రఘునాథ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత 2023లో సింక్ అనే హర్రర్ చిత్రంతో.. 2024లో వచ్చిన సింగపూర్ సెలూన్ మూవీలో RJ బాలాజీ స్నేహితుడిగా నటించాడు. 2025లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తరుణంలో నటించాడు. ఈ మూడు చిత్రాల్లో తన నటనకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. లేటెస్ట్ గానే అతను నటించిన ప్రేమకథా చిత్రం 'ఆరోమలే' థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతోంది.

ఈ చిత్రంలో అతడు పాఠశాల బాలుడు, కాలేజీ స్టూడెంట్, ఉద్యోగం చేసే యువకుడిగా మూడు విభిన్న వయసుల గెటప్‌లలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మన తెలుగు అమ్మాయి శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా నటించగా.. మేఘా ఆకాష్, నర్మద ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి, హనీమూన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
హనీమూన్ వాయిదా..
కిషన్ దాస్ తన ప్రేయసి సుచిత్రతో ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి జరిగింది. వివాహానంతరం కిషన్ దాస్ కుటుంబంతో కలిసి కొన్ని ఫోటోలు షేర్ చేయగా అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలిపారు. అయితే వివాహం తర్వాత కిషన్ దాస్ హనీమూన్ ప్లాన్ చేసుకున్నప్పటికీ, 'ఆరోమలే' షూటింగ్ శరవేగంగా సాగుతుండటంతో అతడు ఆ ప్లాన్‌ను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

కాగా సినిమా పూర్తి చేయడం, ఉత్తమమైన అవుట్‌పుట్ ఇవ్వడం తన మొదటి ప్రాధాన్యమని అందుకే.. అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తూ రియాక్ట్ అవుతున్నారు.
-
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!












Click it and Unblock the Notifications