గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మరోసారి అడ్డంగా బుక్కైన స్టార్ హీరో..
కోలీవుడ్‌లో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందిన హీరో జయం రవి. అయితే ఇటీవలే తన పేరును రవి మోహన్ గా పిలవాలంటూ లేఖ కూడా రిలీజ్ చేశారు. తని ఒరువన్, బోగన్, అదంగ మారు, పోన్మగళ్ వందాల్, పొన్నియన్ సెల్వన్ హిట్ చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఈ హీరో.. ప్రస్తుతం తన సినిమాలకన్నా వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా తెలుగులో తని ఒరువన్ సినిమాను రామ్ చరణ్ ధృవ పేరుతో చేయడంతో ఆయనకు తెలుగులోను మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో మాస్-క్లాస్ ప్రేక్షకులకు ఆయన పాత్రలు బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించిన నాటి నుంచి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈ దంపతులు విడిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కానీ గత కొంతకాలంగా రవి మోహన్.. సింగర్ కేనిషాతో రిలేషన్ లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ గణేష్ కుమార్తె పెళ్లికి ఇద్దరూ కలిసి హాజరవ్వడం, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడంతో వీరి రిలేషన్‌పై మరింత స్పష్టత వచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై వారిద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్ అయ్యి అసలు విషయం రివీల్ చేసే వరకు వీరి రిలేషన్ పై ఓ క్లారిటీ రాదని అంటున్నారు.
మరోవైపు రవి కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బొంబ్లి, సిరెన్, తని ఒరువన్ 2 వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే వ్యక్తిగత జీవితంలో వివాదాలు వెంటాడుతుండటంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.
Ravi Mohan & Keneeshaa!
— Christopher Kanagaraj (@Chrissuccess) May 10, 2025
pic.twitter.com/UphLu7z55y












Click it and Unblock the Notifications