త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు.. టెన్షన్ లో విజయ్..?
తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. చెన్నైలోని తేనాంపేట్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసంలో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కోలీవుడ్ ప్రముఖ నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర చర్చనీయాశం అయింది. ఈ మేరకు చెన్నైలోని తేనాంపేట్ ప్రాంతంలోని త్రిష నివాసంలో బాంబాలు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్ వచ్చింది. దాంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. తేనాంపేట్ లోని త్రిష ఇంటికి చేరుకుని బాంబ్ స్క్వాడ్, జాగీలాలతో త్రిష ఇంట్లో అణువణువు గాలించారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అది ఫేక్ మెయిల్ అని తేల్చారు.
అయితే ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందోనని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులకు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం సాధారణంగానే జరుగుతోందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక త్రిష ఇంట్లో బాంబు పెట్టారన్న న్యూస్ ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయ్ కు తెలిసిందని.. ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

ఇక తమిళనాడులో ఎన్నికల సంగ్రామం హోరాహోరీగా సాగుతోంది. ఏప్రిల్ 23 న రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు మే 4 జరగనుంది. తమిళనాట ఎన్నికలు దళపతి విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. తొలిసారి ఆయన బరిలోకి దిగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విజయ్ రెండో చోట్ల పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు.
-
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
విజయ్ పార్టీలో సినిమా చిచ్చు! కీలక పార్టీ మద్దతు ఖతం -
విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్












Click it and Unblock the Notifications