Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్రికెటర్ భార్యతో స్టార్ హీరో రొమాన్స్..లిప్ లాక్‌తో రెచ్చిపోయి

రొమాన్స్, ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువుగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్‌తో ప్రేమాయణం సాగించారు.అయితే ఒకప్పటి హీరోయిన్, రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీతో రొమాన్స్ చేసింది. ఇప్పుడు అదే హీరోయిన్ టీమిండియా ఆటగాడి భార్యగా మారింది.ఆమె మరెవరో కాదు గీతా బాస్రా.
టీమిండియా ఆటగాడైన హర్భజన్ సింగ్‌ను గీతా బాస్రా వివాహం చేసుకుంది.

గీతా బాస్రా బ్రిటిష్ మాజీ నటి.ఆమె 1984 మార్చి 13న ఇంగ్లాండ్‌లోని పోర్ట్స్‌మౌత్‌లో జన్మించింది. ఆమె బాలీవుడ్ చిత్రాలలో నటించింది.దిల్ దియా హై (2006),ది ట్రెయిన్ (2007),సెకండ్ హ్యాండ్ హస్బెండ్ (2015),జిలా ఘజియాబాద్(2013),మిస్టర్ జో బి. కార్వాల్లో(2014) వంటి సూపర్ హిట్ సినిమాల్లో గీతా బాస్రా నటించారు. ఆమె 2006 నుండి 2016 వరకు నటిగా పనిచేసింది. ఇదే సమయంలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీతో కూడా నటించింది.ఇమ్రాన్ హష్మీతో ముద్దు సన్నివేశాలు కూడా చేసింది.ఇమ్రాన్ హష్మీ ది ట్రెయిన్ సినిమాలో ఆమెతో ప్రేమాయణం సాగించాడు. ఆమె అతనితో కలిసి సంగ్ దిల్ దియా హై చిత్రంలో కూడా నటించింది. ఇదే సమయంలో టీమిండియా క్రికెటర్‌తో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది.

Team India s wife acted in romantic scenes with the hero

టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్‌ను గీతా బాస్రా వివాహం చేసుకుంది..గీతా బాస్రా- హర్భజన్ సింగ్‌‌లది ప్రేమ వివాహం. 2007లో టీం ఇండియా తొలి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న సమయంలో గీతా బాస్రా హర్భజన్ సింగ్‌‌‌కు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు.దీంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. గీతా బాస్రా కోసం హర్భజన్ సింగ్‌ మ్యాచ్ టికెట్లు పంపించడం వంటివి చూస్తుండేవారు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఈ జంట 2016లో వివాహం చేసుకున్నారు. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత గీతా బాస్రా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+