'హనుమాన్' రివ్యూ: 'గుంటూరు కారం'ను తొక్కేసింది!!
తేజ సజ్జా, వరలక్ష్మీ శరత్ కుమార్, అమృత అయ్యర్, సముద్రఖని, గెటప్ శ్రీను, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. టీజర్ దగ్గర నుండే సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది 'హనుమాన్'. తక్కువ బడ్జెట్ తో, చిన్న ఆర్టిస్టులతో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు స్టార్ హీరో సినిమాకన్నా ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాలనటుడిగా అందరినీ మెప్పించిన తేజ సజ్జా హీరోగా మారి చేస్తున్న సినిమా కావడంతోపాటు దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ పై నమ్మకం ఉండటంతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుందా? లేదా? అని తెలుసుకుందాం.
Recommended Video

ఈ సినిమాకు వాడిన సీజీ వర్క్ ను తెలుగు సినిమాలో చూడటం ఒకరకంగా అద్భుతమని చెప్పొచ్చు. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసే రియలిస్టిక్ ఫీల్ ఇచ్చే గ్రాఫిక్స్ వర్క్ "హనుమాన్" సినిమాలో ఉన్నాయి. గ్రాఫిక్స్ వర్కే ఈ సినిమా ప్రధాన ఆస్తి అని చెప్పొచ్చు. చివరి 10 నిముషాల్లో ఆంజనేయుణ్ని చూపించే విధానం గూజ్ బంప్స్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ బడ్జెట్ లో సూపర్ క్వాలిటీ గ్రాఫిక్స్ ను అందించిన ప్రశాంత్ వర్మను అందరూ మెచ్చుకుంటున్నారు.

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి చూసేలా దర్శకుడు ఈ సినిమాను మలిచారు. క్లైమాక్స్ లో ఈ సినిమా రెండో భాగం జై హనుమాన్ కు ఉన్న లీడ్ నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఉంది. దర్శకుడికి పదిరెట్లు ఎక్కువగా పేరు వస్తుంది. ఆవకాయ ఫైట్, ప్రీ క్లైమాక్స్ సూపర్ అని చెప్పొచ్చు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ & కాస్ట్యూమ్స్, సౌండ్ డిజైనింగ్ బాగున్నాయి. అయితే సౌండ్ డిజైనింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

హీరో తేజ సజ్జా స్క్రీన్ ప్రెజన్స్, గ్రాఫిక్స్ వర్క్, సముద్రఖని క్యారెక్టరైజేషన్ తో ఇచ్చిన ఎలివేషన్, దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలి. ఎందుకంటే ఓటీటీలో చూసిన తర్వాత అరే.. ఈ సినిమాను థియేటర్ లో చూస్తే బాగుండేదే అని అనిపిస్తుంది. సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications