విరాళం నేను ఇస్తే రామ్ చరణ్ ఇచ్చినట్టు డబ్బా కొట్టుకున్నారు

ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్' అంటే గుర్తొచ్చే ఏకైక పేరు దర్శకుడు తేజ. ఆయన సినిమా వస్తుందంటే చాలు, అందులో కొత్తదనం, హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథ పక్కా అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యేవారు. తేజ కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు, టాలీవుడ్‌కు కొత్త హీరోలు, హీరోయిన్లను పరిచయం చేసిన గాడ్‌ఫాదర్‌గానూ నిలిచారు.

తేజ తన తొలి సినిమా 'చిత్రం' తోనే ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఈ సినిమా సాధించిన సంచలన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంటనే, ఉదయ్ కిరణ్‌తోనే చేసిన 'నువ్వు నేను' సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు సినిమాల విజయంతో ఉదయ్ కిరణ్ కెరీర్‌ను ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు.

Teja s Shocking Comments on Nijjjam Controversy The Truth Behind Murali Mohan s Compensation

ఆ తర్వాత నితిన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన 'జయం' సినిమా కూడా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఉదయ్ కిరణ్, నితిన్ మాత్రమే కాక, నవదీప్, కాజల్ అగర్వాల్, ప్రిన్స్, నందిత వంటి ఎంతో మంది స్టార్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 'సంబరం', 'జై', 'ధైర్యం', 'ఔనన్నా కాదన్నా' లాంటి ఎన్నో అందమైన ప్రేమకథా చిత్రాలను అందించారు.

అయితే, గత కొన్నేళ్లుగా తేజ సరైన విజయాలు అందుకోలేక రేస్‌లో వెనకబడ్డారనే చెప్పాలి. కొంతకాలం సినిమాల స్పీడ్ తగ్గించిన ఆయన, మధ్యలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించినా, ఆ తర్వాత మళ్లీ జోరు తగ్గించారు.

చివరిగా ఆయన చేసిన సినిమా 'అహింస'. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఆ తర్వాత తేజ నుంచి మరో సినిమా రాలేదు.

ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్య్వూలో తేజా మాట్లాడుతూ.. మహేష్ బాబుతో నిజం సినిమా తీసే సమయంలో తొలుత తండ్రి క్యారెక్టర్‌ను సీనియర్ నటుడు మురళీ మోహన్‌తో షూట్ చేశారు. అయితే మహేష్ బాబు తండ్రిగా మురళీ మోహన్ సెట్ కావడం లేదని, ఆయన రెమ్యూనరేషన్ పూర్తిగా ఇచ్చేసి వేరే అతన్ని పెట్టుకుంటే అది వివాదంగా మారిందని , అయితే తనని సినిమా నుంచి తీసినందుకు గానూ పరిహారం చెల్లించాలని , అది కూడా తనకు కాకుండా గుడికి ఇవ్వాలని మురళీ మోహన్ కోరినట్టు తేజా తెలిపారు.

దానికి సరే అని చెప్పి కొంత డబ్బు చెల్లించానని, అయితే నా పేరుకు బదులు రామ్ చరణ్ గుడికి విరాణం ఇచ్చారని ప్రచారం చేయించుకున్నారని తేజా చెప్పుకొచ్చారు. అయితే దీన్ని నేను పెద్దగా పట్టించుకోలేదని తేజాఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+