సె** లేనిదే లైఫ్ లేదు..తెలుగు హీరోయిన్ సంచలనం
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు.
తాజాగా ఓ హీరోయిన్ శృంగారం గురించి పబ్లిక్‌గా మాట్లాడి సంచలనం సృష్టించింది.ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు తేజస్వి మదివాడ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన తేజస్వి మదివాడ, తర్వాత హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా సందడి చేసింది. ప్రస్తుతం ఈ భామ పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

తాజాగా ఈ అమ్మడు శృంగారం గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది.మనమందరం సెక్స్ వల్లనే పుట్టిన వాళ్లం. శృంగారం లేకుండా లైఫ్ లేదు. పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుడతాము. కానీ మనం అలా ఉండడానికి ఎందుకు ఆలోచిస్తామో అర్థం కాదు. చిన్నప్పుడు టీవీలలో కిస్సింగ్ సీన్స్ వస్తే పేరెంట్స్ కళ్లు మూసేవారు. కొంతమంది అయితే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయే వారు. ఇలా చేసినప్పుడు పిల్లల్లో కుతూహలం ఏర్పడుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి అలాంటివి అలవాటు చేస్తే ఎలాంటి పీలింగ్స్ ఉండవని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తేజస్వి మదివాడ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications