ఆ రెండు సినిమాలంటే కేసీఆర్ కు భలే క్రేజ్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అరుదైన రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతోపాటు కొన్ని దశాబ్దాల కల(తెలంగాణ) సాకారమవడానికి కూడా కారకుడయ్యాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో రాజకీయ చాణక్యుడిగా పేరుపొందాడు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.
మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు. నందమూరి తారక రామారావు నటించిన దానవీర శూరకర్ణను పదే పదే చూస్తుంటారు. ఆయనకు ఈ సినిమా అంటే ఎంతో ఇష్టం. సభల్లో ప్రసంగించే సమయంలో కూడా ఈ సినిమాలోని డైలాగులను ప్రస్తావిస్తుంటారు. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని తన కుమారుడికి పేరు పెట్టడంద్వారా నిరూపించుకున్నారు. మొదట కాంగ్రెస్ లో ఉండి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఉద్యమంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ పార్టీ భారత రాష్ట్ర సమితిగా పేరుతెచ్చుకుంది.

ఈ సినిమా తో పాటు ఎన్టీఆర్ నటించిన ఆరాధన సినిమా అంటే కేసీఆర్ కు చాలా చాలా ఇష్టం. కేసీఆర్ మాంసాహార ప్రియుడు. నాటుకోడి కూర అంటే ఎంతో ఇష్టం. పలు సందర్భాల్లో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా చేయించుకుంటుంటారు. రాజకీయకాల్లో ఎంత బిజీగా ఉన్నా తనకు ఇష్టమైన ఆహారం తినడంలో ఏమాత్రం ఎక్కడా రాజీపడరు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రస్తుతం మూడోసారి ముఖ్యమంత్రి అవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున ఏర్పాటవుతున్న సభలు సమావేశాల్లో పాల్గొంటూ భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారంలోకి ఎందుకు రావాలనే అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications