ఎస్.. మన జగ్గన్నే

Jagga Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి సినీ అరంగేట్రం చేయబోతోన్నారు. జగ్గారెడ్డి- ఎ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాను నిర్మించనున్నారు. అందులో లీడ్ క్యారెక్టర్‌లో నటించనున్నారు. ఈ సినిమా పోస్టర్ ఇదివరకే విడుదలైంది.

ఆయన సొంత చిత్ర నిర్మాణ సంస్థ జయలక్ష్మి సినిమాస్ పేరుతో ఏర్పాటు చేసిన సినిమా కార్యాలయాన్ని కొత్త తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ ఉగాదిని పురస్కరించుకుని ప్రారంభించారు. టైటిల్ మోషన్ టీజర్‌ను రిలీజ్ చేశారు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది.

Telangana Congress leader Jagga Reddy inaugurates his own film venture on Ugadi 2025

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు వడ్డి రామానుజంతో కలిసి మాట్లాడారు. తన జీవితాన్నే ఈ సినిమాలో చూపించబోతోన్నామని అన్నారు. జగ్గారెడ్డి- ఎ వార్ ఆఫ్ లవ్ సినిమా ఆఫీస్ అంటే ఇకపై తన అడ్డా అని తెలిపారు. ఇకపై తాను ఇక్కడే అందుబాటులో ఉంటానని చెప్పారు. సినిమా నిర్మాణ పనులు ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు.

రాజకీయ రంగంలో తాను ఎలా విజయవంతంగా రాణించానో.. ఇక్కడ కూడా అంతే విజయవంతం అవుతానని నమ్ముతున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. తన జీవితంలో విద్యార్థి నేతగా, రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత కౌన్సిలర్‌గా, మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎదిగిన తీరును ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలిపారు.

ఒక మంచి లవ్ స్టోరీని దర్శకుడు రామానుజం తనకు వివరించాడని, ఇందులో లీడ్ క్యారెక్టర్‌కు తాను అయితేనే సరిపోతానని చెప్పాడని అన్నారు. అప్పుడే పోస్టర్‌ను డిజైన్ చేసి చూపించారని గుర్తు చేశారు. ఈ పోస్టర్ తనకు బాగా నచ్చిందని, అందుకే సినిమాకు ఓకే చేశానని జగ్గారెడ్డి వివరించారు.

ఈ సినిమాకు సంబంధించిన రాజకీయ జీవిత కథను తానే రాసుకున్నానని జగ్గారెడ్డి చెప్పారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కిస్తామని, వాటిని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నామని అన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తనపై కుట్రలు జరిగాయని పేర్కొన్నారు.

రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో తాను ఎదుర్కొన్న కుట్రలు, వ్యూహాలు, కష్టాలు- కన్నీళ్లు, పడిన బాధలను జగ్గారెడ్డి- ఎ వార్ ఆఫ్ లవ్ సినిమా చూపిస్తామని అన్నారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండే తాను సినిమా వైపు రావడం అనేది కాలం నిర్ణయమేనని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+