తెలుగు ఫోక్ సింగర్‌కి లక్కీ ఛాన్స్.. బిగ్ బాస్ కాదు ధనుష్ మేనల్లుడితో మూవీ !
టాలెంట్ ఎవరి సొత్తు కాదని.. కష్టపడితే సాధించలేనిది అంటూ ఏది లేదని ఇప్పటి వరకు ఎందరో నిరూపించారు. అలా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్లు.. సూపర్ స్టార్లు.. మెగా స్టార్లు అయిన వారు చాలా మందే ఉన్నారు. అయితే గతంలో సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే.. కానీ నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత అనూహ్యంగా మారింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో విడుదలవుతున్న ఆల్బమ్ పాటలు సైతం మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి. వాటిలో నటించిన కళాకారులు కూడా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందుతున్నారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఆ కోవకు చెందినవారే. ఆమె తెలంగాణ బిడ్డ నాగదుర్గ. జానపద గీతాలతో గత కొన్ని సంవత్సరాలుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. "దారిపొంటత్తుండు," "నా పేరు ఎల్లమ్మ," "ఎర్ర రుమాల్," "కాపోళ ఇంటికాడ" వంటి పాటలతో విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. "కలివనం" అనే తెలుగు సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించినప్పటికీ.. ఆ చిత్రం విడుదలైందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

అయితే కొన్ని రోజుల క్రితం తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌లో నాగదుర్గ పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం పుకార్లే అని తేలింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు తమిళ చిత్రసీమలో హీరోయిన్‌గా అడుగుపెట్టనున్నారు నాగదుర్గ. ప్రముఖ నటుడు ధనుష్ మేనల్లుడు పవీష్.. గత సంవత్సరం "జాబిలమ్మ నీకు అంత కోపమా" అనే డబ్బింగ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. అయితే పవీష్ నటిస్తున్న కొత్త చిత్రంలో నాగదుర్గ హీరోయిన్‌గా నటించనున్నారు.
ఈ చిత్రం విజయవంతమైతే నాగదుర్గకు తమిళంలో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. నాగదుర్గకు ముందు శాన్వి మేఘన, గౌరీప్రియ వంటి తెలుగు నటీమణులు తమిళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుని గుర్తింపు పొందారు. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో హీరోయిన్లుగా పెద్దగా కనిపించని ఈరోజుల్లో వేరే భాషల్లో అయిన రాణిస్తుండడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications