సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌‌కు బంపర్ బొనాంజా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాహుల్‌కు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.

పాతబస్తీ కుర్రాడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, "ఆర్‌ఆర్‌ఆర్" సినిమాలోని "నాటు నాటు" పాటతో ఆస్కార్ వరకు వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాహుల్ సిప్లిగంజ్ స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి అని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణ యువతకు అతను ఆదర్శప్రాయుడని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Telangana government awards Rs 1 crore cash award to singer Rahul Sipligunj

గత ఎన్నికలకు ముందు, అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్‌కు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కోటి రూపాయల నగదు పురస్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇటీవల గద్దర్ అవార్డుల కార్యక్రమంలో కూడా రాహుల్ సిప్లిగంజ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి, త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం, ఇవాళ పాతబస్తీ బోనాల పండుగ సందర్భంగా రాహుల్‌కు ఈ నజరానాను ప్రకటించి, రేవంత్ రెడ్డి తన హామీని నెరవేర్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+