బాలీవుడ్ లోకి కిసిక్ బ్యూటీ.. స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ..!
తెలుగు నటి శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఓ వైపు స్టార్ హీరోల సరసన కథానాయికగా చేస్తూనే.. మరోవైపు ఐటెం సాంగ్స్ తో రఫ్పాడిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ 'పుష్ప-2'లో కిసిక్ సాంగ్ లో శ్రీలీల చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్ తో తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీ చిత్ర పరిశ్రమనూ ఓ ఊపుఊపింది ఈ భామ.అంతకు ముందు 'గుంటూరు కారం' చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ తో, 'ధమాకా' చిత్రంలో రవితేజతోనూ స్టెప్పులేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం శ్రీలీల నితిన్ 'రాబిన్ హుడ్ ', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రాలతో బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా ఈ పాల బుగ్గల అమ్మాయికి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ లో ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ పాత్రకు శ్రీలీలను ఓకే చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఇటీవల బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఆఫీస్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తో శ్రీలీల ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోందని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అవన్నీ రూమర్స్ అని తెలిసిపోయింది.

తాజాగా టీ - సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాణ సంస్థలో రాబోయే చిత్రంలో బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ కార్తిక్ ఆర్యన్ హీరోగా సినిమా వస్తోంది. అయితే ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన 'మిట్టీ' చిత్రంలోనూ శ్రీలీల నటిస్తోందన్న గుసగుసలు వినిపించాయి. అవి కూడా రూమర్స్ గానే మిగిలాయి. మరోవైపు రష్మిక మందాన బాలీవుడ్ లో దూసుకెళ్తున్న తరుణంలో శ్రీలీల కూడా బాలీవుడ్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ఏడాదిలోనే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అని తెలిసిపోయింది.












Click it and Unblock the Notifications