మొదటి భార్యను ఎదురించి హీరోయిన్‌ను రెండో పెళ్లి చేసుకున్న సీఎం
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారనే మీకు తెలుసా. అది కూడా ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని దాదాపు నాలుగేళ్లు రహస్యంగా మెయిన్‌టైన్ చేశారంటే అది మమూలు విషయం కాదు. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు కర్నాటక మాజీ సీఎం , జేడీఎస్ అధినేత కుమారస్వామి. అదృష్టం కలిసి వచ్చి పరిమిత ఎమ్మెల్యేలతో రెండుసార్లు కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు.
ఇక కుమారస్వామి వైవాహిక జీవితం కూడా ఓ సంచలనమే అని చెప్పాలి. ఆయన కర్నాటక రాజకీయాల్లో ఎంత ఫేమస్ అయ్యారో.. అంతకంటే ఎక్కువగానే తన పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచారాయన.1986 సంవత్సరంలో అనిత అనే ఆమెను కుమారస్వామి మొదటి వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి నిఖిల్ గౌడ అనే కొడుకు ఉన్నాడు. అయితే కుమారస్వామి ఎవరికి తెలియకుండా 2006లో రాధిక అనే హీరోయిన్‌ను రెండో వివాహం చేసుకున్నారు.

రాధిక హీరోయిన్‌గా చేసే సమయంలో కుమారస్వామి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు ఆ సమయంలో రాధికతో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో రాధికను కుమారస్వామి రెండో వివాహం ఇంట్లో తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. ఈ విషయం 2010లో రాధిక చెప్పే వరకు కుమారస్వామి రెండో వివాహం చేసుకున్నారనే విషయం ఎవరికి తెలియదు. రెండో వివాహ సమయంలో కుమారస్వామి వయస్సు 47 కాగా, అతని కంటే రాధిక 27 సంవత్సరాలు చిన్నది కావడం విశేషం.
కుమారస్వామితో పాటు, రాధికకు కూడా ఇది రెండో వివాహమే. ఆమె 2000 సంవత్సరంలో రతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 14 ఏళ్ల వయసులో పెళ్లయ్యాక.. భర్త బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లి ఆరోపణలు చేసింది.పెళ్లైన రెండేళ్లకు భర్త రతన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చి కన్నుమూశాడు. దీంతో తరువాత కుమారస్వామితో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు దారి తీసింది. ఇదిలా ఉంటే రాధిక తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. తారకరత్న నటించిన భద్రాద్రిరాముడు సినిమాతో పాటు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అవతారం సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. హెచ్‌డి కుమారస్వామిని పెళ్లి చేసుకోవడానికి రాధిక తన తండ్రిని ఎదురించింది. ఇటు కుమారస్వామి సైతం తన తండ్రి హెచ్‌డి గౌడతో పాటు, తన మొదటి భార్యను ఎదురించి మరి రాధికను రెండో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఇది రెండవ వివాహం. వీరికి షమిక అనే కుమార్తె ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications