యంగ్ హీరోను టార్గెట్ చేసిన తెలుగు సినీ 'పెద్దలు'!
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల కోసం ఎంత రచ్చ జరిగిందో మనందరం చూశాం. హనుమాన్ విడుదల కాకుండా చూడటానికి పెద్ద పెద్ద ప్రయత్నాలు చేశారు. థియేటర్లు దొరక్కుండా అడ్డుకున్నారు. సంక్రాంతి రేసు నుంచి తప్పించేందుకు రాజకీయం చేశారు. అయితే ఎవరి నుంచి, ఎటువైపు నుంచి అండదండలు లేకుండా నేరుగా థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి భాషలో సూపర్ హిట్ అయింది.
సినిమా కంటెంట్‌లో ఉంటే ఎవరూ తొక్కేయలేరని హనుమాన్ నిరూపించింది. సంక్రాంతి ముగిసి నెలరోజులు కాకుండానే థియేటర్ల కోసం మళ్లీ రగడ ప్రారంభమైంది. రవిజేత సినిమా ఈగిల్ కు సోల్ రిలీజ్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ సినిమాతోపాటు యాత్ర2, ఊరిపేరు భైరవకోన రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ఈ మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈగిల్ కు సోల్ రిలీజ్ డేట్ ఇస్తామన్న హామీతోనే ఆ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించిన సినీ పెద్దలు అదే తేదీకి సందీప్ కిషన్ సినిమా ఊరిపేరు భైరవకోన ఉందనే విషయాన్ని మరిచిపోయారు.

ఈగిల్ ను తిరిగి వాయిదా వేయించలేరు. అంతేకాకుండా యాత్ర2 వైఎస్ జగన్ బయోపిక్ కావడంతో దాన్నికూడా వాయిదా వేయించలేరు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఊరిపేరు భైరవకోనపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే నిర్మాత అనిల్ సుంకర ఒప్పుకోవడంలేదు. పరిశ్రమలోని పెద్దలంతా అనిల్ పై ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఆయన ససేమిరా అంటున్నారు. వెనక్కి వెళితే వడ్డీలు భరించలేమని, సినిమాను కొన్నవారు కూడా అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో సినీ పెద్దలు మళ్లీ ఏం చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications