రహస్యంగా పెళ్లి చేసుకున్న తెలుగు హీరో, హీరోయిన్లు?

ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు చేసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. కొందరు చిన్న వయసులోనే చేసుకుంటుండగా, మరికొందరు మాత్రం కాస్తంత వయసు మీరిన తర్వాత చేసుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడంతోపాటు కాపురాలు కూడా పెట్టేస్తున్నారు. వాస్తవానికి అంత రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? తమకు పెళ్లి అయిన విషయాన్ని బయటపెట్టడానికి ఎందుకు భయపడుతున్నారనేది అర్థం కాకుండా ఉంది.

తాజాగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ జంట ఈ జాబితాలో చేరింది. పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో హీరోయిన్లు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు కూడా ఎక్కువగా లేవు. ఒకటే సినిమా చేశారు. అయితే ఆ సినిమా మాత్రం సూపర్ హిట్ అయింంది. ఈ సినిమా తర్వాత ఆ హీరోయిన్ తమిళంలో కూడా సినిమాలు చేసి మంచి గుర్తింపును పొందింది. అయితే తెలుగులో మాత్రం ఎక్కువ అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

Telugu hero and heroines secret marriage

సదరు హీరో మాత్రం ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో అరకొరగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవలే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ తమిళ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈ వార్త పెద్ద చర్చనీయాంశంగా మారింది. పెళ్లి చేసుకున్న ఈ హీరో హీరోయిన్ ఎవరంటూ ఎవరికివారు ప్రశ్నించుకుంటున్నారు. నెటిజన్ల మధ్య దీనిపైనే చర్చ నడుస్తోంది. అంత రహస్యంగా పెళ్లిచేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చేసుకున్నారంటూ చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+