సొంత వదినతో రొమాన్స్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. హీరోలతో పోలిస్తే, హీరోయిన్ల కెరీర్ తక్కువ కాలం ఉంటుంది. దీంతో వాళ్లు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటుంటారు. అయితే ఇదే సమయంలో వయస్సులో సంబంధం లేకుండా నటించాల్సి ఉంటుంది. తండ్రితో హీరోయిన్‌గా నటించిన ఆమె, ఆయన కొడుకుతో కూడా నటించాల్సి వస్తుంది. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఇలా చేసిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కాజల్, తమన్నా, శృతి హాసన్ వంటి ఈ తరం హీరోయిన్లు చిరంజీవితో పాటు ఆయన కొడుకు రామ్ చరణ్‌తో సైతం నటించారు. గతంలో అతిలోక సుందరి శ్రీదేవి సైతం అక్కినేని నాగేశ్వరరావుతో పాటు, ఆయన తనయుడు నాగార్జునతో కూడా పలు సినిమాల్లో నటించారు.

అయితే శ్రీదేవి తన భర్త తమ్ముడితో పలు సినిమాల్లో నటించింది. భూలోక సుందరిగా పేరు గాంచిన శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి పాత తరం హీరోలతో పాటు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి రెండో తరం హీరోలతో కూడా ఆమె నటించారు. తెలుగులో కెరీర్ పీక్ టైంలో ఉండగానే , అమ్మడు బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ అమితాబ్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇదే సమయంలో బాలీవుడ్ దర్శకుడు బోనీ కపూర్‌తో ప్రేమలో పడి, అతన్ని వివాహం చేసుకుంది. అయితే అప్పటికే బోనీ కపూర్‌కు వివాహం అయింది.

Telugu hero who romanced his brother wife

ఇదిలా ఉంటే బోనీ కపూర్‌ సొంత తమ్ముడు అనిల్ కపూర్‌తో కలిసి శ్రీదేవి పలు సినిమాల్లో నటించింది.వెండితెరపై వీరి జోడి సూపర్ హిట్‌గా నిలిచింది. మిస్టర్ ఇండియా (1987),లాడ్లా (1994)జుదాయి (1997),కర్మ (1986),జాంబాజ్ (1986),రూప్ కీ రాణి చోరోన్ కా రాజా (1993),లమ్హే (1991),హీర్ రాంఝా (1992), మిస్టర్ బేచారా (1996), వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఈ జోడి కలిసి నటించారు. బోనికపూర్‌ను పెళ్లికి ముందు శ్రీదేవి అనిల్ కపూర్‌తో తెర మీద రొమాన్స్ చేసింది. ఒక సినిమాలో అయితే ఏకంగా శ్రీదేవిపై అత్యాచారం చేసే క్యారెక్టర్‌లో అనిల్ కపూర్ కనిపించాడు.ఇలా సొంత వదినతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోగా అనీల్ కపూర్ నిలిచిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+