తెలుగు హీరోయిన్ బొడ్డు: జననాయగన్ రివ్యూపై మండిపడుతున్న తెలుగు ఫ్యాన్స్!
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ఎంతో కాలంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సినిమా 'జననాయగన్' బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది. విజయ్ ఫ్యాన్స్ సినిమా బాగుందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా.. తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోగా పేరొందిన దళపతి విజయ్ వీడ్కోలు సినిమాకు ఇది కోలుకోలేని దెబ్బ అని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిత్రంపై సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ రంగన్ రివ్యూలో పేర్కొన్న ఓ కామెంట్.. సినిమా రిజల్ట్ కంటే తీవ్రమైన వివాదానికి దారితీసింది.
ఈ చిత్రంలోని హింసను వర్ణిస్తూ.. " తెలుగు సినిమాలో హీరోయిన్ బొడ్డు కనిపించినంత తరచుగా స్క్రీన్ పై రక్తం కనిపిస్తోంది" అంటూ భరద్వాజ్ రంగన్ కామెంట్ చేశారు. ఈ కామెంట్ పై తెలుగు సినీ ప్రేక్షకులు, అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అనవసరంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని కించపరిచేలా ఆయన మాట్లాడారని సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ల బొడ్డును చూపించే తీరుపై ట్రోల్స్ వచ్చినా.. ఓ బాధ్యతాయుతమైన సినీ క్రిటిక్ అదే పాత ధోరణిని రిపీట్ చేయడం హుందాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక సినిమా నచ్చకపోతే విమర్శించే హక్కు క్రిటిక్స్ కు ఉంటుందని.. కానీ చిత్ర పరిశ్రమను మొత్తం ఇలా అవహేళన చేయడం బాగా లేదని కొందరు వాదిస్తున్నారు. ఈ వివాదం రంగన్ గతంలో చేసిన కొన్ని కామెంట్లను కూడా మళ్లీ తెరపైకి తెచ్చింది. చాలా మంది యూజర్లు ఆయన గతంలో చేసిన గజినీ రివ్యూను షేర్ చేశారు, అందులో ఆయన నయనతారను " అధిక బరువున్న నయనతార, ఆమె నడుముపై కొవ్వు పొరలు మెక్సికన్ వేవ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి" అని వర్ణించాడు. మరికొందరు నటుడు టోవినో థామస్ ఒక గంభీరమైన అంశంపై చర్చించడానికి ప్రయత్నిస్తుండగా.. భరద్వాజ్ రంగన్ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి జోక్ చేసిన ఒక ఇంటర్వ్యూను కూడా గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటనలు భరద్వాజ్ రంగన్ వ్యాఖ్యలు సినిమా విమర్శల హద్దులు దాటి వ్యక్తిగత లేదా మూస ధోరణి కామెంట్ల స్థాయికి దిగజారడాన్ని చూపిస్తున్నాయని విమర్శకులు అంటున్నారు.
తమిళ సినిమాతో సహా ప్రతి చిత్ర పరిశ్రమలోనూ రొటీన్ ఫార్ములాలు, కమర్షియల్ అంశాలు ఉంటాయని చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా ఎత్తి చూపుతున్నారు. అందుకే ఈ వ్యాఖ్య నిజంగా అవసరమా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
brooohh😭😭The what...???? pic.twitter.com/mgwg2qXQdj
— ROHIT|| (@Redrayer45) July 23, 2026












Click it and Unblock the Notifications