'ఐ బొమ్మ'లోకి వచ్చేసిన కొత్త సినిమాలు..రూ.200 కోట్ల సినిమా కూడా
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది. ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్‌బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు.
దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలతో పాటు, కొన్ని వెబ్ సిరీస్‌లు, డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన జాక్ సినిమా ఐబొమ్మలో ప్రత్యక్షం అయింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అలాగే తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల -2 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓదెల సినిమా సూపర్ హిట్ కావడంతో, ఆ సినిమా సీక్వెల్‌గా ఓదెల -2 సినిమాను తెరకెక్కించారు.అయితే ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. అందుకే విడుదలైన మూడు వారాలకే ఈ సినిమా ఐబొమ్మలో ప్రత్యక్షమైంది.
ఇక బుల్లితెర మీద యాంకర్‌గా ఓ వెలుగు వెలిగిన ప్రదీప్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కూడా ఐబొమ్మలోకి వచ్చేసింది. ఈ సినిమాలో దీపిక పిల్లి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఇక తమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సైతం ఐబొమ్మలో అందుబాటులోకి వచ్చింది. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.200 కోట్లు సాధించిన అజిత్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టింది ఈ సినిమా.












Click it and Unblock the Notifications