జానీ మాస్టర్‌పై కేసు వెనక తెలుగు స్టార్ హీరో?
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. జాతీయస్థాయి అవార్డులను రెండుసార్లు దక్కించుకున్న ఏకైకా కొరియోగ్రాఫర్ గా ఉన్న జానీ మాస్టర్ పై శ్రేష్టి వర్మ అనే మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తన ఇంటికి వచ్చి కూడా బలాత్కారం చేశాడని పేర్కొంది. వాస్తవానికి ఏం జరిగిందనే విషయం తెలుసుకోవడానికి జానీమాస్టర్ ద్వారా తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించినప్పటికీ అతను అందుబాటులో లేడు.
స్పందించని జానీ మాస్టర్
కనీసం అతను ఇంతవరకు ఈ విషయంపై స్పందించలేదు. మౌనంగా ఉన్నాడు. అతను ఎంతో ఇష్టపడి చేరిన జనసేన పార్టీ కూడా సస్పెండ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విధులకు దూరంగా ఉండాలని ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాడనే సమాచారం మేరకు నార్సింగి పోలీసులు అక్కడకు వెళ్లారు. తెలుగు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కు జానీ మాస్టర్ అధ్యక్షుడిగా ఉన్నారు. జానీమాస్టర్ పై శ్రేష్టివర్మ లాంటి మహిళా కొరియోగ్రాఫర్, అందులోను కెరీర్ ప్రారంభంలో ఉన్న వర్మ కేసుపెట్టే ధైర్యం చేయదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెద్దవారు ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి
ఆమె వెనక ఉన్న పెద్దవారు ధైర్యం కల్పించి జానీ మాస్టర్ పై కేసు పెట్టించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన బయటకు వచ్చిన వెంటనే గీతా ఆర్ట్స్ శ్రేష్టి వర్మకు అవకాశాలిస్తామని ముందుకు వచ్చింది. ఫిలిం ఛాంబర్ కూడా అండగా నిలబడింది. ఆమెకు అండగా నిలబడి జానీపై కేసు పెట్టించడం వెనక ఓ తెలుగు స్టార్ హీరో హస్తం ఉందంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తనను తాను నిరూపించేకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ హీరోకు కూడా జానీమాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ ఇచ్చారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి జానీ మాస్టర్ మద్దతుగా నిలవడం, బహిరంగంగానే ఆ విషయం ప్రకటించడంతోపాటు బయటకు రాని మరికొన్ని సంఘటనలు కూడా ఉన్నాయని తెలుగు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. జానీమాస్టర్ ను ఇలాగే వదిలేస్తే తనకు ఇబ్బంది అవుతుందని భావించిన ఆ స్టార్ హీరో ఇలా పావులు కదిపినట్లు సమాచారం. దీనిపై తెలుగు సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications