చిరంజీవికి ఇష్టమైన బాలయ్య సినిమా ఏదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి కథానాయకుడు బాలకృష్ణ కొన్ని దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వారిద్దరి పోటీమాత్రం తప్పడంలేదు. ఎవరికి వారే పోటాపోటీగా సినిమాలు నిర్మిస్తున్నారు. వీరిద్దరి సినిమాలు ఎప్పుడు విడుదలైనా అభిమానుల మధ్య గొడవ మాత్రం తీవ్రంగా జరుగుతుంటుంది. ఒకేరోజు వీరిద్దరి సినిమాలు విడుదలవుతున్నాయంటూ రాష్ట్రంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది.

హీరోలు ఎన్ని సినిమాలు తెరకెక్కించినప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు కొన్నే ఉంటాయి. నటించిన కథానాయకుడికే కాకుండా ఇతర కథానాయకులు, నిర్మాతలు, దర్శకులు కూడా వీటిపై ప్రశంసలు కురిపిస్తారు. సమయం కుదిరితే వెంటనే తమ ఫేవరెట్ సినిమా చూసేస్తారు. నందమూరి అభిమానులఅందరినీ ప్రశ్నిస్తే బాలకృష్ణ సినిమాల్లో సమరసింహారెడ్డి ఆల్ టైం ఫేవరెట్ మూవీ అని చెబుతారు.

telugu star hero chiranjeevi like balakrishna samarasimha reddy movie

బాలయ్య కెరీర్ ను మలుపుతిప్పింది. చాలామంది తెలుగు సినీ హీరోలకు ఫేవరెట్ మూవీ కూడా సమరసింహారెడ్డే. మెగాస్టార్ చిరంజీవి కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలయ్య నటించిన సినిమాల్లో తాను పదే పదే చూడాలనుకున్నది, ఆసక్తి కలిగించిన సినిమా ఏదైనా ఉందా? అంటే అది సమరసిహారెడ్డి సినిమా అని చెప్పారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమరసింహారెడ్డి సినిమాలో బాలయ్య అద్భుతమైన నటనా ప్రతిభను ప్రదర్శించారు. ఓ రేంజ్ లో తొడలు కొట్టారు. గొడ్డలి పట్టుకొని శత్రువు నట్టింటికి వచ్చి నరకడం, పీకలు కోయడం లాంటివన్నీ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఎన్నికలతో బిజీగా ఉన్న బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీచేస్తున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలోని సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+