ఎన్టీఆర్‌ను తొక్కేయడానికి ఆ స్టార్ హీరో విశ్వప్రయత్నం?
యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి హీరోగా మారిపోయారు. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయారని చెప్పొచ్చు. ఆ సినిమాలో తారక్ నటనకు, హావభావాలకు అందరూ ముగ్ధులయ్యారు. ప్రస్తుతం చేస్తున్న దేవర, వార్2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే చిత్రంతో సహా అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఇక్కడ వచ్చిన ఫలితాన్ని బట్టి విదేశీ భాషల్లోకి విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు. తిరుగులేని విధంగా, ఒక స్టార్ హీరోగా రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేయడానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరో ప్రయత్నిస్తున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు.
నీలం చొక్కా వేస్తే ట్రోలింగ్
జూనియర్ ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మొన్న నీలం రంగు చొక్కా వేసుకుంటే వైసీపీకి అనుకూలమంటూ ట్రోల్ చేశారు. తాజాగా తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తే కొందరు వ్యక్తులు దూషించడం జరిగింది. పరిశ్రమలో ఎన్టీఆర్ ను తొక్కేయడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయనే వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ దేవర చిత్రం నుంచి విడుదలైన ఫియర్ పాటపై కావాలనే నెగెటివ్ ప్రచారాన్ని ప్రారంభించారు. పరిశ్రమలో తారక్ ను నిలదొక్కుకోనివ్వకుండా చేయాలన్నదే ఆ స్టార్ హీరో ఉద్దేశమని తెలుస్తోంది.

డబ్బులిచ్చి మరీ నెగెటివ్ ప్రచారం
సదరు స్టార్ హీరో తన బ్యాగ్రౌండ్ సపోర్టుతో పీఆర్ టీంను ఉపయోగించుకుంటూ ఫియర్ పాటపై నెగెటివ్ ట్రోలింగ్ ప్రారంభించాడు. డబ్బులిచ్చి మరీ దేవర సినిమా ఫ్లాప్ చేయించడానికి నెగెటివ్ కామెంట్లు పెట్టిస్తున్నారనే ప్రచారం తెలుగు ఫిలింనగర్ లో జరుగుతోంది. అయితే దీనిపై నందమూరి అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, బ్రహ్మదేవుడే దిగివచ్చినా ఏం చేయలేరని, దేవర సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే ధీమాను వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు.. తారక్ మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నా వదిలిపెట్టడంలేదని, అతని మంచితనాన్ని చేతకానితనంగా, అలుసుగా తీసుకోవద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications