'అఖండ'లో విలన్ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరో
నందమూరి నటసింహం బాలకృష్ణ జోరు ప్రస్తుతం ఏ అగ్ర కథానాయకుడికి లేదు. కుర్ర డైరెక్టర్లతో వరుసపెట్టి సినిమాలు చేయడమే కాకుండా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తున్నాడు. తన తరం హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జునకంటే ఎంతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్నంత వేగంగా ఏ హీరో కూడా సినిమాలు చేయడంలేదు.
కుర్ర హీరోలు కూడా నెమ్మదిగానే సినిమాలు చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా బాలయ్య సినీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో సూపర్ హిట్లు కొట్టి హ్యాట్రిక్ సాధించడమే కాకుండా ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అది ఈ ఏడాది వేసవికి విడుదల కానుంది.

బోయపాటి సినిమా అనగానే విలన్ కు ప్రత్యేకత ఉంటుంది. ఆయన ప్రతి సినిమాలో విలన్ క్యారెక్టర్ ను హీరోకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఒకే సినిమాలో హీరోతోపాటు విలన్ కలిపి ఇద్దరు హీరోలుంటారు. అటువంటి సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా మెప్పించాడు. కొత్త తరహా శ్రీకాంత్ ను బోయపాటి పరిచయం చేశారు. వాస్తవానికి ఈ పాత్రను ముందుగా స్టార్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ చేత వేయిద్దామనుకున్నారు. ఆ సమయంలో కొన్ని సినిమాలు చేస్తూ రాజశేఖర్ బిజీగా ఉన్నాడు. దీంతో శ్రీకాంత్ ను సంప్రదించిన దర్శకుడు ఆయన్ను ఓకే చేశారు.
సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం రాజశేఖర్ ఒక కుర్ర హీరో కు తండ్రిగా నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అఖండలో శ్రీకాంత్ చేసిన క్యారెక్టర్ రాజశేఖర్ చేసివుంటే విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా జగపతిబాబుకు వచ్చిన పేరు వచ్చివుండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విలన్ గా రాజశేఖర్ సరిగా సెట్టవుతారని అంటున్నారు. ఏదన్నాకానీ రాజశేఖర్ లాంటి పవర్ ఫుల్ విలన్ ను మాత్రం ప్రేక్షకులు చూడలేకపోయారు.












Click it and Unblock the Notifications