విడుదలై నాలుగేళ్లవుతున్నా టాప్-10లోనే ఉన్న తెలుగు స్టార్ హీరో సినిమా
ఈరోజుల్లో ఒక సినిమా విడుదలైందంటే కేవలం థియేటర్లలో నెలరోజులు ఆడితేనే పండగ చేసుకుంటున్నారు. మొదటి వారం, రెండు వారాల్లోనే సినిమాకు సంబంధించిన పెట్టుబడిని మొత్తం లాగేసుకోవడానికి సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఒక సినిమా సంవత్సరం ఆడింది, 200 రోజులు ఆడింది, సిల్వర్ జూబ్లీ చేసుకుంది, శతదినోత్సవం, అర్థ శతదినోత్సవం జరుపుకుంది.. అనే మాటలు గతంలోనే వినపడేవి. వాటిని ఈ తరం ప్రేక్షకులు అసలు మర్చిపోయారు. కొంతమందికైతే వాటి వివరాలు కూడా తెలియదు.
ఆయన తీరుకు అందరూ ఫిదా అయ్యారు
సినిమా విడుదలైన నెలరోజులకు లేదంటే 40 రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీనివల్ల నిర్మాతలకు కొంత డబ్బు ఆదాయం రూపంలో వస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తీసిన ఆర్ఆర్ఆర్ గురించి అందరికీ తెలిసిందే. 2022లో ఈ సినిమా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1250 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమాను మన దేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాలకు చెందినవారు కూడా తర్వాత అత్యధికంగా చూశారు. రాజమౌళి సినిమా తీసిని తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు.

ఎన్నో సినిమాలు వస్తున్నాయి.. పోతున్నాయి..
ఇటీవలే హాలీవుడ్ నిర్మాత - దర్శకుడు తారక్ తో సినిమా చేయాలనుందని ప్రకటించారు. ఆస్కార్ కు ఎంపికై అవార్డను కూడా ఆర్ఆర్ఆర్ గెలుచుకుంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సినిమాను ఆస్కార్ కు పంపించకపోయినా ప్రయివేటు కేటగిరి నుంచి వెళ్లి మరీ అవార్డును సాధించింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా చూశారు. ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10లోనే నిలకడగా ఉంటోంది. ఎన్నో సినిమాలు వస్తున్నాయి.. పోతున్నాయి కానీ ఆర్ఆర్ఆర్ మాత్రం అలాగే టాప్ 10లో కొనసాగుతుండటంపై సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications