సమంతకు అవమానం.. హీరోయిన్ గా వద్దన్న స్టార్ హీరో
తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్ధార్థ్ తో ప్రేమ.. ఆ తర్వాత విడిపోవడం.. నాగచైతన్యను ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. విడిపోవడం.. ఒకదానివెంట ఒకటిగా అన్నీ జరిగిపోయాయి. చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు ఇంకా ఎక్కువ పాపులారిటీ దక్కింది. తాను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఎప్పటికప్పుడు విషయాలన్నింటినీ సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.
ఎవరూ ఆఫర్లు ఇవ్వడంలేదు
మయోసైటిస్ కు చికిత్స కోసమని సినిమాలకు విరామం ప్రకటించింది. తీరా ఇప్పుడు నటిద్దామంటే ఎవరూ ఆఫర్లు ఇవ్వడంలేదు. అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి కానీ వాటిపై అధికారికంగా ధ్రువీకరణ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ వార్త వైరలవుతోంది. సమంతను స్టార్ హీరో వద్దన్నారనేది ఆ వార్త సారాంశం. రవితేజ-గోపీచంద్ కాంబినేషన్ లో బలుపు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. హీరోకు, దర్శకుడికి మంచిపేరు తెచ్చిపెట్టింది.

సమంత వద్దు..
ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అయితే దర్శకుడు గోపీచంద్ ముందుగా ఈ పాత్రలో సమంతను నటింపచేయిద్దామనుకున్నారు. అయితే రవితేజ ఒప్పుకోలేదు. సమంత వద్దంటే వద్దని శ్రుతిహాసన్ వైపే మొగ్గుచూపాడు. దీంతో చివరకు ఆమెనే దర్శకుడు ఎంపిక చేశాడు. సమంత కూడా ఆ పాత్రను పరోక్షంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. రవితేజ హీరోయిన్ గా సమంతను వద్దన్నాడని, అది సమంతకు అవమానంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సమంత ఇంకా ఏయే సినిమాల్లో నటిస్తుందనే విషయమై స్పష్టత లేదు.












Click it and Unblock the Notifications