జూనియర్ ఎన్టీఆర్‌ను ఫంక్షన్‌కు పిలిచి అవమానించిన స్టార్ హీరో
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2, డ్రాగన్ సినిమాలు చేస్తున్నారు. దేవర2 ఉంటుందా? ఉండదా? అనేది ఇంకా తేలలేదు. కొరటాల శివ తయారు చేసే స్క్రిప్ట్ ను బట్టి ఇది ఆధారపడివుంటుంది. ఇది ఎన్టీఆర్ కు సంతృప్తినివ్వాలి. లేదంటే దేవర2 ఉండదు. దేవర1 కూడా ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, అనిరుధ్ బీజీఎంమీద కొట్టుకొచ్చి రూ.550 కోట్లు రాబట్టగలిగింది. ప్రస్తుతం నందమూరి పేరుతో ఉన్న ఇతర కుటుంబాలకు చెందిన వ్యక్తులతో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో ఎటువంటి ఇబ్బందిలేదుకానీ ఆయన మరణించిన తర్వాత కొన్ని పరిణామాలతో నందమూరి కటుుంబ సభ్యులు తారక్ కు దూరం జరిగారా? లేదంటే తారక్ వారికి దూరం జరిగారా? అనే విషయంలో స్పష్టత లేదు.
ఎవరూ మాట్లాడకపోవడంతో వెళ్లిపోయాడు
బాలకృష్ణ కుమార్తె నిశ్చితార్థం జరిగే సమయంలో ఆహ్వానం అందుకున్న ఎన్టీఆర్ ను అక్కడకు వెళ్లిన తర్వాత ఎవరూ మాట్లాడించలేదు.. పట్టించుకోలేదు. కొంత సమయం వేచిచూసిన తర్వాత కార్యక్రమం మధ్య నుంచి తారక్ వెళ్లిపోయారు. ఇలా ఎన్నో విషయాల్లో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చి పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. హిందీలో కూడా నేరుగా సినిమాలు చేస్తూ అక్కడ కూడా మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒక్కటిగా ఉన్నారు. నందమూరి కుటుంబ సభ్యులకు వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. వేడుకలకు కూడా వెళుతున్నట్లు లేదు.

కల్యాణ్ రామ్ కు ఉన్న అప్పులన్నీ తీర్చేశాడు
ఎన్టీఆర్ తాను చేసే ప్రతి సినిమాలోను కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ను భాగస్వామిగా చేస్తున్నాడు. అతనికి ఉన్న అప్పులన్నీ తీర్చేసి ఉపశమనం కల్పించాడు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో వీరిద్దరూ స్పందించలేదు. బాలయ్య ఎవరిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తాడో? ఎవరిపై ప్రేమ కురిపిస్తాడో? ఎవరికీ అర్థం కాదు. ఏదేమైనప్పటికీ బాలయ్యకు వీరిద్దరూ దూరం జరిగారు. పద్మభూషణ్ అందుకున్న తర్వాత మాత్రం బాల బాబాయ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి బాలయ్య రిప్లై ఇచ్చారో లేదో తెలియరాలేదు. ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ రాజకీయాలకు దూరం జరిగారు. ఇదే మంచి పద్ధంటూ అతని అభిమానులు కూడా అంటున్నారు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications