మహేష్‌బాబు ముందు తేలిపోయిన రామ్‌చరణ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కసారిగా జాతీయస్థాయిలో ట్రెండింగ్ అవడమేకాదు.. నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వివాహానికి కుటుంబ సభ్యులతో సహా మహేష్ బాబు హాజరయ్యారు. తొలిసారిగా కొత్త లుక్ లో తనను చూసినవారంతా స్టన్ అయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ ఓ పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఇటీవలే జర్మనీ వెళ్లి శిక్షణ తీసుకొని వచ్చారు. తర్వాత సినిమాలో ఎలా ఉండాలని రాజమౌళి భావిస్తున్నారో ఆయన భావాలకు అనుగుణంగా తన స్టైల్ ను మార్చుకుంటున్నారు.

సింగిల్ గా స్టిల్ కావాలంటూ..
ఇదే కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సతీసమేతంగా హాజరయ్యారు. అయితే మహేష్ బాబు లుక్ ను చూసిన ఫొటోగ్రాఫర్లంతా సింగిల్ గా ఫొటోలు తీసుకుంటామని, సహకరించాలని కోరగా ఆయన ఓకే అన్నారు. ప్రిన్స్ లుక్ ట్విటర్ లో ట్రెండింగ్ అయింది. పాన్ వరల్డ్ మూవీలో మహేష్ బాబు ఇలాగే ఉంటాడని భావించిన అభిమానులంతా ఆ లుక్ ను ట్రెండింగ్ లోకి తెచ్చారు. అయితే ఫొటోగ్రాఫర్లు సింగిల్ గా లుక్ కావాలని రామ్ చరణ్ ను అడగకపోవడంతో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారు.

telugu superstar mahesh babu attended anant ambani and radhika marchant marriage

భారీగా పెరుగుతున్న అంచనాలు
ప్రిన్స్ నటించిన అన్ని సినిమాలు హిందీలో డబ్ చేసి నిర్మాతలు విడుదల చేశారు. యూట్యూబ్ లో కూడా వీటికి విపరీతమైన ఆదరణ దక్కుతోంది. భారీ సంఖ్యలో వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. రాజమౌళి సినిమాలో మహేష్ బాబు అనేసరికి దేశవ్యాప్తంగా దీనిపై అంచనాలు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై దాదాపు రూ.1500 నుంచి రూ.2వేల కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. అంతేకాదు.. ఎక్కువ సంఖ్యలో హాలీవుడ్ నటులే నటించనున్నారు. ఇందులో ప్రిన్స్ కు విలన్ గా విక్రమ్ నటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ధ్రువీకరణ రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+