రూ. వందల కోట్లు కూడబెట్టిన మన హీరోయిన్లు

మన తెలుగు సినీ పరిశ్రమే కాకుండా ఏ సినీ పరిశ్రమలోనైనా హీరోలకు ధీటుగా హీరోయిన్లు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్‌ను బట్టి దర్శక, నిర్మాతలు కూడా అడిగినంత చెల్లిస్తున్నారు. సంపాదించిన సొమ్ముతో హీరోయిన్లందరూ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాటినుంచి కూడా సొమ్మును ఆర్జిస్తున్నారు. రెండు దశాబ్దాల నుంచి పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష సినిమాకు రూ.6 నుంచి రూ.10 కోట్లు తీసుకుంటోంది. ప్రస్తుతం మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆమె ఆస్తుల విలువ రూ.100 కోట్లుగా ఉంది.

రష్మిక ఆస్తుల విలువ తెలుసా?
టాప్ హీరోయిన్ గా ఎదిగిన పూజాహెగ్డే గ్రాఫ్ ఇటీవలే ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తోందని వార్తలు వస్తున్నాయికానీ ఇంకా అధికారిక ధ్రువీకరణ రాలేదు. సినిమాకు రూ.4 కోట్లు తీసుకునే పూజాకు రూ.55 నుంచి రూ.60 కోట్ల వరకు ఆస్తులున్నాయి. సినిమాకు రూ.4 కోట్లు తీసుకునే కాజల్ కు రూ.60 నుంచి రూ.65 కోట్ల వరకు ఆస్తులున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక సినిమాకు రూ.5 నుంచి రూ.6 కోట్లు తీసుకుంటోంది. ఆమె ఆస్తుల విలువ రూ.70 నుంచి రూ.80 కోట్ల మధ్యలో ఉన్నట్లు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు రూ.3.5 కోట్ల వరకు తీసుకుంటుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ఆస్తుల విలువ రూ.50 నుంచి రూ.55 కోట్ల మధ్యలో ఉంది. మహానటి కీర్తిసురేష్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సినిమాకు రూ.4 కోట్లు తీసుకుంటుంది. ఆమె ఆస్తుల విలువ రూ.50 కోట్లుగా ఉంది.

telugu top 10 heroines total property value details here

సమంత, నయనతార ఆస్తుల విలువ తెలుసా?
నయనతార సినిమాకు రూ.10 నుంచి రూ.12 కోట్లు తీసుకుంటోంది. ఆమె ఆస్తుల విలువ రూ.300 కోట్లుగా ఉంది. ఇళ్లతోపాటు ప్రయివేట్ జెట్ కూడా ఈమెకు ఉంది. అనుష్క సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటుంది. ఆమె ఆస్తులు రూ.135 కోట్లుగా ఉంటాయి. అలాగే తమన్నా కూడా సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటోంది. ఆమె ఆస్తుల విలువ రూ.140 కోట్ల వరకు ఉంది. చివరగా సమంత విషయానికి వస్తే సినిమాకు రూ.8 కోట్ల పారితోషికం తీసుకుంటోంది. ఆమె ఆస్తుల విలువ రూ.110 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+