నార్త్ లో అల్లు అర్జున్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు హీరో

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. పాన్ ఇండియా సినిమాగా సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ జనాలు కూడా బాగా ఆదరించారు. దీంతో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంతోపాటు టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం ప్రారంభం కావడం, జర్మనీలోని ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటుడు కావడంలాంటి కారణాలన్నీ ఉత్తరాదిలో బన్నీ క్రేజ్ ను ఆసాంతం పెంచేశాయి.

పాన్ ఇండియా హీరోగా అటు బాలీవుడ్ లో, ఇటు తెలుగులో అల్లు అర్జున్ సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. అయితే అల్లు అర్జున్ కన్నా ప్రస్తుతం మన తెలుగు హీరో ఒకరికి ఉత్తరాదిన ఎక్కువ క్రేజ్ ఉంది. అతనెవరో కాదు రామ్ పోతినేని. రామ్ హిందీ డబ్బింగ్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభించడమేకాదు.. గూగుల్ లో రామ్ గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. రామ్ పోతినేని సినిమాలను చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నామని వారే చెప్పడం విశేషం. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

telugu young hero ram pothineni is more crazed in bollywood than allu arjun

ఈ సినిమాతో బాలీవుడ్ లో పాగా వేయాలని రామ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే విడుదలయ్యేవరకు వేచిచూడక తప్పదు. మొత్తానికి రామ్ పోతినేని తన స్టామినాను బాలీవుడ్ ప్రేక్షకులకు చూపిస్తూ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. ఎంతవరకు ఆయన సక్సెస్ అవుతారో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+