విడాకుల వివాదం, త్రిషతో రూమర్స్.. మౌనం వీడిన విజయ్ !
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం గురించి.. ముఖ్యంగా నటి త్రిషతో ఆయనకు సంబంధం ఉందంటూ వస్తున్న పుకార్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తన భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేసుకోవడం, ఆ వెంటనే త్రిషతో కలిసి విజయ్ ఒక పబ్లిక్ ఈవెంట్లో కనిపించడం వంటి పరిణామాలు ఈ వివాదాన్ని మరింత వేడెక్కించాయి. వీటిపై తాజాగా విజయ్ తన టీవీకే పార్టీ నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకల సందర్భంగా పరోక్షంగా స్పందించారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
"నా కోసం మీరు బాధపడటం నాకు నొప్పి కలిగిస్తోంది"
తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలు, విమర్శల పట్ల విజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "ఇటీవల కొన్ని అనవసరమైన వివాదాలు తలెత్తుతున్నాయి. నా వ్యక్తిగత విషయాల వల్ల నా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందులకు గురవుతుండటం, నా కోసం సోషల్ మీడియాలో పోరాడుతూ బాధపడటం నాకు చాలా నొప్పిగా అనిపిస్తోంది" అని విజయ్ వ్యాఖ్యానించారు. తన కోసం పార్టీ సభ్యులు కష్టపడాల్సిన అవసరం లేదని, ఆ వివాదాలను తానే స్వయంగా పరిష్కరించుకుంటానని విజయ్ భరోసా ఇచ్చారు.

ప్రజా సేవయే ముఖ్యం
వివాదాల కంటే పార్టీ బాధ్యతలు, ప్రజా సేవయే ముఖ్యమని విజయ్ కార్యకర్తలకు సూచించారు. "వ్యక్తిగత విమర్శల గురించి పట్టించుకోకండి. మీరు వాటికి స్పందించాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం ప్రజా సంక్షేమం మాత్రమే. పార్టీ బాధ్యతలపై, ప్రజలకు చేయాల్సిన సేవపై దృష్టి పెట్టండి" అని విజయ్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల కంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
విజయ్ చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పరోక్షంగానైనా వివాదాల గురించి ప్రస్తావించడం మంచి పరిణామమని.. ఆయన ఇప్పుడు పూర్తిగా ప్రజా సేవపై దృష్టి సారించారని కొంతమంది మద్దతుదారులు భావిస్తున్నారు.మరికొందరు మాత్రం విజయ్ స్పష్టంగా పేరు ఎత్తకుండా పరోక్షంగా మాట్లాడటం వల్ల సందేహాలు తొలగిపోవని.. త్రిషతో ఉన్నట్లు వస్తున్న రూమర్లపై నేరుగా సమాధానం చెప్పాల్సి ఉందని విమర్శిస్తున్నారు. దర్శకుడు అమీర్ వంటి వారు ఈ విషయంలో విజయ్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
విజయ్ మాటలు రాజకీయంగా ఆయనకున్న పరిణతిని చూపిస్తున్నాయని కొందరు అంటుంటే, వ్యక్తిగత జీవితంపై వస్తున్న ప్రశ్నలను ఆయన దాటవేస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా, విజయ్ స్పందన ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications